కోలీవుడ్ నటుడు జయం రవి, అతని భార్య ఆర్తి విడాకుల ప్రకటన తర్వాత వారిద్దరి మధ్య సోషల్ మీడియా వేదికగా యుద్ధం నడిచిన విషయం తెలిసిందే. ఒకరిపై ఒకరు ఘాటు ఆరోపణలు చేస్తూ, హద్దులు దాటి పోస్ట్‌లు పెడుతూ ఈ జంట కొంతకాలంగా వార్తలలో నిలుస్తున్నారు. ఆర్తి ఇటీవల జయం రవి మూడో వ్యక్తి కారణంగా విడాకులు తీసుకుంటున్నట్లు సంచలన వ్యాఖ్యలు చేసింది. అంతేకాదు, సింగర్ కెనిషాతో ఆయన డేటింగ్ చేస్తున్నారని ఆరోపిస్తూ ఓ పోస్టు పెట్టింది. దీనిపై జయం రవి స్పందించి వివరణ ఇచ్చినా… ఆర్తి మాత్రం తానేం తప్పుచేయలేదన్న భావంలో కొనసాగింది.
అయితే తాజా పరిణామాలు అందరికీ షాకివ్వడమే కాదు, ఊహించని మలుపు తీసుకున్నాయి. హైకోర్టు ఈ దంపతుల మధ్య పెరుగుతున్న సోషల్ మీడియా పరస్పర విమర్శలను గమనించి, ఇద్దరూ పరువు నష్టం కలిగించే విధంగా పోస్ట్‌లు చేయవద్దని ఆదేశించింది. ఈ తీర్పుతో ఆర్తి తన భర్తపై గతంలో పెట్టిన అన్ని పోస్టులను డిలీట్ చేసింది.
దీంతో కొంతమంది వీరిద్దరూ తిరిగి కలవబోతున్నారేమో అనే ఊహాగానాలు చర్చకు తెరలేపినా… ఆర్తి మాత్రం తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా స్పష్టతనిచ్చింది. ‘‘న్యాయాన్ని నిలబెట్టిన హైకోర్టుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. న్యాయవ్యవస్థ తన బాధ్యతను నెరవేర్చింది. పరువు నష్టం నుండి రక్షించడం, న్యాయం చేకూర్చడం గొప్ప విషయం’’ అంటూ పేర్కొంటూ, కోర్టు ఆదేశాల నోటీసును కూడా షేర్ చేసింది. ఇప్పటికే విడాకుల కోసం కోర్టు చుట్టూ తిరుగుతున్న ఈ జంటకు.. హైకోర్టు ఉత్తర్వులతో తాత్కాలిక విరామం ఏర్పడినట్లయింది. ఇక వీరి వ్యవహారం ఏ దిశగా సాగుతుంది అన్నది కాలమే చెప్పాలి.


