Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభA Rated Films: ఈ సినిమాలకే హైయ్యెస్ట్ కలెక్షన్స్!

A Rated Films: ఈ సినిమాలకే హైయ్యెస్ట్ కలెక్షన్స్!

A Rated Films: మన సౌత్ సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమాకి ఎ సర్టిఫికెట్ రావడం ఒకప్పుడు చాలా అరుదుగా ఉండేది. ఎక్కువ అడల్ట్ కంటెంట్ లేదా భారీగా రక్తపాతం ఉన్న సినిమాలకే సెన్సార్ వాళ్ళు ఇలా ఎ సర్టిఫికెట్ ని జారి చేస్తారు. గతంలో సెన్సార్ సర్టిఫికెట్ చూసి థియేటర్స్ కి రావాలా వద్దా అని కూడా నిర్ణయించుకునేవారు. కానీ, రాను రాను హింసాత్మక చిత్రాలే సంచలనం సృష్ఠిస్తున్నాయి. అలా వచ్చిన మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఊహించని రికార్డ్స్ ని నమోదు చేసి వసూళ్ల పరంగా టాప్ పొజిషన్ లో నిలిచాయి. ఆ చిత్రాలను ఒకసారి చూద్దాం..

- Advertisement -

సలార్: సాహో, రాధే శ్యామ్ లాంటి వరుస ఫ్లాప్స్ తర్వాత పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటించిన హెవీ యాక్షన్ మూవీ సలార్. ఉగ్రం, కేజీఎఫ్ ఫ్రాంఛైజ్ తర్వాత దర్శకుడు ప్రశాంత్ నీల్ నుంచి వచ్చిన సినిమా. దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తీసిన బాహుబలి సిరీస్ లో కూడా ఈ రేంజ్ హింస లేదు. కానీ, సలార్ మూవీలో మాత్రం యాక్షన్ సీన్స్ లో రక్తపాతం చూస్తే ఒంటిపై రోమాలు నిక్కబొడుచుకోవాల్సిందే. పేరుకు హీరోయిన్ శ్రుతి హాసన్ ఉన్నా.. ఒక్క సాంగ్ గానీ, హీరోహీరోయిన్ల మధ్య రొమాంటిక్ సీన్ గానీ లేదు. ఈ సినిమా రిలీజైన మొదటిరోజు వరల్డ్ వైడ్ గా 178 కోట్లను రాబట్టి ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది.

Also Read – Aamir Khan Remunaration: ఆమిర్ ఖాన్ రెమ్యునరేషన్ వైరల్.. క్లారిటీ ఇచ్చిన బాలీవుడ్ స్టార్

కూలీ: సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రధాన పాత్రలో నాగార్జున, ఉపేంద్ర, ఆమిర్ ఖాన్, సత్యరాజ్, శ్రుతి హాసన్ లాంటి వారు కీలక పాత్రల్లో నటించిన సినిమా కూలీ.. తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి డివైడ్ టాక్ తో రన్ అవుతోంది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి సెన్సార్ ఎ సర్టిఫికెట్ ఇచ్చింది. అయితే, మొదటి కలెక్షన్స్ దుమ్మురేగిపోయాయి. కూలీ డే 1 కలెక్షన్స్ 151 కోట్లు వచ్చాయి. రజినీ సినిమాకి ఎంత డివైడ్ టాక్ వచ్చినా వసూళ్ళ పరంగా మాత్రం సెన్షేషన్ ని క్రియేట్ చేస్తుంది.

అనిమల్: టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వచ్చిన బాలీవుడ్ సెన్షేషనల్ మూవీ అనిమల్. రన్‌బీర్ కపూర్, రష్మిక మందన్న, త్రిప్తి డిమ్రి, అనిల్ కపూర్, బాబి డియోల్ ప్రధాన పాత్రల్లో నటించారు. పక్కా రొమాంటిక్, అడల్ట్ అంట్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ సినిమా రిలీజైన మొదటి రోజునుంచే హిట్ టాక్ ని తెచ్చుకుంది. మొదటి రోజు అనిమల్ 116 కోట్లను రాబట్టింది. ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాల కంటే కూడా ఇలా హింస ఎక్కువ ఉన్న సినిమాలనే ఈ తరం ప్రేక్షకులు కూడా ఆదరిస్తున్నారని తెలుస్తోంది.

Also Read – WAR 2 Climax : క్లైమాక్స్… ఎన్టీఆర్ కోసమే మార్చారా?

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad