Saturday, May 3, 2025
Homeచిత్ర ప్రభHit 3: ‘హిట్‌ 3’ ఫస్ట్‌ డే వసూళ్లు ఎంతంటే..?

Hit 3: ‘హిట్‌ 3’ ఫస్ట్‌ డే వసూళ్లు ఎంతంటే..?

నేచురల్ స్టార్ నాని(Nani) హీరోగా శైలేశ్‌ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘హిట్‌ 3’(Hit 3) మూవీ మే 1న విడుదలైంది. ‘హిట్‌’ ఫ్రాంఛైజీలో భాగంగా వచ్చిన ఈ చిత్రంలో అర్జున్‌ సర్కార్‌ పాత్రలో నాని రెచ్చిపోయాడు. సాఫ్ట్‌గా కనిపిస్తూనే వైలెంట్‌గా నటించాడు. దీంతో తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద అదరగొడుతోంది. ఈ నేపథ్యంలో తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.43 కోట్లు వసూలు చేసినట్లు నిర్మాణసంస్థ అధికారికంగా తెలిపింది. నాని కెరీర్‌లోనే తొలిరోజు అత్యధిక వసూళ్లు సాధించిన రెండో చిత్రంగా నిలిచింది.

- Advertisement -

దేశవ్యాప్తంగానే కాకుండా ఓవర్సీస్‌లోనూ ఈ చిత్రం సత్తా చాటుతోంది. ఓవర్సీస్‌లో తొలిరోజే వన్‌ మిలియన్‌ డాలర్ల క్లబ్‌లో చేరింది. ఈ వీకెంట్‌లో రెండు మిలియన్‌ డాలర్లు వసూలు చేసే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు ప్రముఖ టికెట్‌ బుకింగ్ ప్లాట్‌ఫామ్‌ బుక్ ‌మై షోలోనూ రికార్డులు సృష్టిస్తోంది. 24 గంటల్లో 2.72లక్షల టికెట్లు అమ్ముడైనట్లు సంస్థ తెలిపింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News