నేచురల్ స్టార్ నాని (Nani) హీరోగా తెరకెక్కిన చిత్రం ‘హిట్ 3’(HIT 3). శైలేష్ కొలను తెరకెక్కించిన ఈ చిత్రం మే 1న పాన్ ఇండియా చిత్రంగా విడుదల కానుంది. అయితే టికెట్ ధరల పెంపుపై చిత్ర బృందం విజ్ఞప్తి మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టికెట్ ధరలు పెంచుకునేలా అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. సింగిల్ స్క్రీన్స్‌లో జీఎస్టీతో కలిపి రూ.50 , మల్టీప్లెక్స్‌ల్లో జీఎస్టీతో కలిపి రూ.75 పెంచుకునేలా వెసులుబాటు కల్పించింది. సినిమా విడుదలైన నాటి నుంచి వారం పాటు అదనపు ధరలు అమల్లో ఉండనున్నాయి.
కాగా హిట్’ యూనివర్స్‌లో భాగంగా ‘హిట్: ది థర్డ్ కేస్’ తెరకెక్కింది. ఈ సినిమాలో నాని సరసన కేజీఎఫ్ భామ శ్రీనిధి శెట్టి కథానాయికగా నటించారు. ఏ సర్టిఫికెట్ పొందిన ఈ మూవీ 2:37 గంటల రన్‌టైమ్‌తో విడుదల కానుంది. నాని కెరీర్‌లోనే మోస్ట్ వైలెంట్ చిత్రంగా రూపొందినట్లు మూవీ యూనిట్ ప్రకటించింది.