Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభAllu Arjun: అల్లు అర్జున్ నిర్మాతల రిస్క్.. AA22 కోసం హాలీవుడ్ విలన్

Allu Arjun: అల్లు అర్జున్ నిర్మాతల రిస్క్.. AA22 కోసం హాలీవుడ్ విలన్

Atlee: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అట్లీ కాంబోలో రూపొందుతోన్న AA22 సినిమాపై అంచనాలు పీక్స్‌లో ఉన్నాయి. ఈ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ షూటింగ్ ఇటీవలే ముంబైలో గ్రాండ్‌గా మొదలైంది. కొన్ని కీలక సన్నివేశాలు ఇప్పటికే పూర్తయ్యాయి. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మితమవుతున్న ఈ భారీ విజువల్ గ్రాండియర్‌లో ప్రతిదీ అదుర్స్ అనేలా ఉంటుందని చిత్ర యూనిట్ చెబుతోంది. ఈ సినిమాలో హీరోయిన్లుగా దీపికా పదుకునే, మృణాల్ ఠాకూర్ నటించడం ఖరారైంది. త్వరలోనే జాన్వీ కపూర్ ప్రకటన కూడా రాబోతోందని బజ్ ఉంది. వీళ్ళే కాదు, బన్నీతో ‘పుష్ప’ జోడీగా సత్తా చాటిన రష్మిక మందన్న కూడా ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌లో భాగం కాబోతోందని ఇన్‌సైడ్ టాక్. ఇంతమంది స్టార్ హీరోయిన్లు ఒకే సినిమాలో ఉండటం సినిమాపై అంచనాలను మరింత పెంచేస్తోంది.

- Advertisement -

AA22లో విలన్‌గా ఎవరు నటిస్తారనేదానిపై అందరిలోనూ ఆసక్తి పెరుగుతోంది. సినీ సర్కిల్స్‌లో అయితే విల్ స్మిత్, డ్వెన్ జాన్సన్ పేర్లు వినిపిస్తున్నాయి. ఒకరు హాలీవుడ్ లోకం నెంబర్ వన్ స్టార్ విల్ స్మిత్ కాగా, మరొకరు ‘ది రాక్’ గా పేరొందిన డ్వెన్ జాన్సన్. వినడానికి గొప్పగా ఉన్నా, వీళ్ళను ఒప్పించడం అంత సులువు విషయం కాదు. భారీ రెమ్యునరేషన్ ఛార్జ్ చెల్లించాల్సి ఉంటుంది. మూవీ మేకింగ్ విషయంలో రాజీ పడకూడదనే టీమ్ భావిస్తున్నా, యాక్టర్ల పారితోషికాలు హద్దులు దాటిపోతే ఇబ్బందేనని చర్చ జరుగుతోంది. హాలీవుడ్ యాక్టర్స్ రెమ్యునరేషన్, రానూపోనూ విమాన ఖర్చులు భరించడం, మెయింటైన్ చేయడం పెద్ద ప్రహసనం అని యూనిట్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి.

Also Read – Bank Holiday July: బ్యాంకు సెలవులున్నాయ్.. ముందే జాగ్రత్తపడండి

‘స్పిరిట్’ కోసం డాన్ లీని దాదాపుగా లాక్ చేసుకున్న సందీప్ రెడ్డి వంగాను స్ఫూర్తిగా తీసుకుని అట్లీ ఇలా ప్లాన్ చేశాడని చెప్పలేం కానీ, సబ్జెక్టు డిమాండ్ చేస్తోందట. AA22 రిలీజ్‌ను 2027 సంక్రాంతి టార్గెట్‌గా పెట్టుకుని రూపొందిస్తున్నారు. ఎంత పెద్ద బడ్జెట్ సినిమా అయినా అనుకున్న టైంలో పూర్తి చేయడంలో అట్లీ ఎక్స్‌పర్ట్ అని పేరుంది. ఇప్పుడు కూడా అదే కమిట్‌మెంట్‌తో పని చేస్తున్నాడని తెలుస్తోంది. ఈ మూవీ విజువల్ ఎఫెక్ట్స్ (VFX) కోసం పలు అంతర్జాతీయ కంపెనీలు పని చేస్తున్నాయి. చివరి నిమిషం వరకు ఒత్తిడి తెచ్చుకోకుండా కంటెంట్‌ను త్వరగా సిద్ధం చేసేలా ముందు నుంచే ప్లానింగ్‌తో ముందుకెళుతున్నారని సమాచారం. ఈ సినిమాలో క్యాస్టింగ్‌కు సంబంధించిన చాలా సర్ ప్రైజులు ఉండబోతున్నాయని టాక్. ఈ అప్డేట్స్ అన్నీ చూస్తుంటే, AA 22 బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టించడం పక్కా అనిపిస్తోంది.

Also Read – OnePlus Pad Lite: వన్‌ప్లస్ నుంచి కొత్త ట్యాబ్లెట్..ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..?

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad