Hombale Films: ఒకప్పుడు సినిమా అంటే హీరో పేరు, డైరెక్టర్ పేరు మాత్రమే వినిపించేది. కానీ, ఈ రోజుల్లో ఒక కొత్త ట్రెండ్ మొదలైంది. సినిమాలో హీరో ఎవరు అనేదానికన్నా ముందు ఆ సినిమా ఏ ప్రొడక్షన్ హౌస్ లో వస్తుందో అని చూస్తున్నారు ప్రేక్షకులు. అలా కొన్ని ప్రొడక్షన్ హౌస్ లు మాత్రమే ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్నాయి. అందులో ముందుగా వినిపించే పేరు హోంబాలే ఫిల్మ్స్ (Hombale Films). అవును, గత కొన్నేళ్లుగా ఈ ప్రొడక్షన్ హౌస్ సృష్టిస్తున్న సంచలనాలు, అందుకుంటున్న విజయాలు చూస్తుంటే… హోంబాలే అంటే కేవలం ప్రొడక్షన్ హౌస్ కాదు, అది ఒక బ్లాక్‌బస్టర్ బ్రాండ్ అని ఫిక్స్ అయిపోవచ్చు.
ALSO READ: https://teluguprabha.net/cinema-news/rukmini-vasanth-succsess-story/
రాఖీ భాయ్ నుండి బెర్మే వరకు!
హోంబాలే గురించి మాట్లాడాలంటే ముందుగా గుర్తొచ్చేది ‘K.G.F’ సిరీస్. రాఖీ భాయ్ (యష్), ప్రశాంత్ నీల్ విజన్ కలిసి సౌత్ సినిమా స్థాయిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాయి. కేవలం కన్నడ సినిమాకే పరిమితమైన హీరోలను, టెక్నీషియన్లను ప్యాన్ ఇండియా స్టార్స్‌గా మార్చింది ఈ నిర్మాణ సంస్థ.
ఆ తర్వాత వచ్చిన విజువల్ వండర్… ప్రభాస్ ‘సలార్’! ‘K.G.F’ ఫార్ములాను దాటి, మరో సరికొత్త కథాంశంతో, భారీ నిర్మాణ విలువలతో వచ్చి బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఇది రుజువు చేసింది ఏంటంటే… హోంబాలే దృష్టి కేవలం హీరోల మీద కాదు, సరికొత్త కథలు, బలమైన కంటెంట్ మీదే ఉంటుందని.
పెద్ద బడ్జెట్ సినిమాలు బ్లాక్‌బస్టర్ అవ్వడం సహజమే. కానీ, తక్కువ బడ్జెట్‌తో వచ్చి దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకులను ఆశ్చర్యపరిచిన చిత్రం ‘కాంతార’. కేవలం హిట్టు కాదు, ఒక సెన్సేషన్. ఈ సినిమా తెలుగుతో సహా అన్ని భాషల్లో ఊహించని విధంగా కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఒక ప్రాంతీయ కథను అత్యంత అద్భుతంగా ప్రపంచానికి పరిచయం చేసిన ఘనత హోంబాలేకే దక్కుతుంది. ఇక ఇప్పుడు ‘కాంతార చాప్టర్ 1’ థియేటర్స్ లో రీలిజ్ అయ్యి బ్లాక్ బస్టర్ టాక్ తో కలెక్షన్స్ మోత మోగిస్తోంది.
ALSO READ: https://teluguprabha.net/cinema-news/f1-movie-celebrates-100-das-success/
ఇక హోంబాలే ప్రొడక్షన్ హౌస్ అనౌన్స్ చేసే ప్రతి సినిమా కూడా మార్కెట్‌లో అంచనాలను అమాంతం పెంచేస్తోంది. ‘నరసింహా అవతార్’ ఒక యానిమేషన్ అంటే ఎవరు నమ్మరు. ఆ విధంగా తెరకెక్కించారు. బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా చేసిన సంచలనం అంతా ఇంతా కాదు. ‘సలార్’, ‘K.G.F’ సినిమాలు తీసిన హోంబలే ప్రొడక్షన్ హౌస్ ఈ సినిమా తియ్యడం హోంబాలే మీద మరింత ఎక్స్పెక్టేషన్ పెరిగేలా చేసింది. ఇక తర్వాత ఎన్టీఆర్, ప్రశాంత్
నీల్ సినిమాతో మన ముందుకు రాబోతున్న ఈ ప్రొడక్షన్ హౌస్ ఈసారి విజువల్స్ ని ఏ రేంజిలో చూపిస్తుందో అని ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.


