Janhvi Kapoor: బాలీవుడ్ మూవీ హోమ్ బౌండ్ ఇండియా నుంచి ఆస్కార్‌కు అఫీషియల్ ఎంట్రీగా నిలిచింది. 2026 ఆస్కార్ అవార్డుల్లో బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో ఈ సినిమా పోటీపడబోతుంది. ఈ ఆస్కార్ ఎంట్రీ మూవీలో ఇషాన్ ఖట్టర్, విశాల్ జెత్వా, జాన్వీకపూర్ హీరోహీరోయిన్లుగా నటించారు. నీరజ్ గైవాన్ దర్శకత్వం వహించాడు.
షాకింగ్ కలెక్షన్స్…
హోమ్ బౌండ్ మూవీ సెప్టెంబర్ 26న రిలీజైంది. ఆస్కార్ ఎంట్రీని దక్కించుకోవడం, జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించడంతో భారీ అంచనాల నడుమ ఈ మూవీ థియేటర్లలోకి వచ్చింది. కరణ్ జోహార్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించిన మూవీ కావడంతో కలెక్షన్స్ భారీగానే వస్తాయని అనుకున్నారు. ఫస్ట్ డేనే థియేటర్లలో హోమ్‌బౌండ్ మూవీకి పెద్ద షాక్ తగిలింది. కేవలం 29 లక్షల కలెక్షన్స్ మాత్రమే దక్కించుకున్నది. ఈ అవార్డ్ విన్నింగ్ సినిమాను ఆడియెన్స్ పెద్దగా పట్టించుకోలేదు. తొలి రోజే చాలా చోట్ల థియేటర్లు ఖాళీగా దర్శనమిచ్చాయి. ఎక్కడ కూడా హౌజ్‌ఫుల్స్ కనిపించలేదు. హైదరాబాద్‌లో పట్టుమని పది థియేటర్లలో కూడా హౌమ్‌బౌండ్ రిలీజ్ కాలేదు. ఆస్కార్ సినిమాకు ఈ రేంజ్ కలెక్షన్స్‌ను అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదని ఆడియెన్స్ అంటున్నారు.
Also Read – Og Sucess Meet: ఓజీ గ్రాండ్ సక్సెస్ మీట్… ఎప్పుడు… ఎక్కడంటే? – పవన్ కళ్యాణ్ వస్తున్నాడు!
రెండో రోజు బెటర్…
ఫస్ట్ డే కలెక్షన్స్ దర్శకనిర్మాతలను కూడా విస్మయానికి గురిచేసినట్లు ప్రచారం జరుగుతోంది. రెండో రోజు కలెక్షన్స్ కాస్త బెటర్ అని అంటున్నారు. 50 లక్షల వరకు వసూళ్లు వచ్చే అవకాశం ఉన్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఓవరాల్‌గా రెండు రోజుల్లో హోమ్‌బౌండ్ మూవీ 80 లక్షల కలెక్షన్స్ దక్కించుకొని డిసపాయింట్ చేసింది.
జాన్వీ కపూర్ హీరోయిన్…
కొవిడ్ బ్యాక్‌డ్రాప్‌లో ఇద్దరు స్నేహితుల జీవితాల నేపథ్యంలో దర్శకుడు నీరజ్ గైవాన్ హోమ్‌బౌండ్ సినిమాను రూపొందించారు. షోయబ్ అలీ (ఇషాన్ కట్టర్), చందన్ కుమార్ (విశాల్ జెత్వా) ప్రాణ స్నేహితులు. నిమ్న వర్గాలకు చెందిన వీరు కుల వివక్ష కారణంగా ఇద్దరు ఎన్నో అవమానాలు ఎదుర్కొంటారు. పోలీసు ఉద్యోగంలో చేరాలని కలలు కంటారు. కానీ అనుకోని పరిస్థితుల్లో చిన్న చిన్న ఉద్యోగాల్లో అలీ, చందన్ చేరుతారు. కొవిడ్ వారి జీవితాలను ఎలాంటి మలుపులు తిప్పింది? సుధా(జాన్వీకపూర్), చందన్‌ల ప్రేమకథ ఏమైంది అన్నదే ఈ మూవీ కథ.
పెద్దిపైనే ఆశలు…
జాన్వీ కపూర్ గత సినిమా పరమ్ సుందరి కూడా పరాజయం పాలైంది. ప్రస్తుతం జాన్వీ ఆశలన్నీ రామ్‌చరణ్ పెద్దిపైనే ఉన్నాయి. బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఈ తెలుగు మూవీ వచ్చే ఏడాది మార్చిలో రిలీజ్ కాబోతుంది. దేవర తర్వాత తెలుగులో జాన్వీకపూర్ చేస్తున్న సినిమా ఇది.
Also Read – SS Thaman: లెక్కలన్నీ మారిపోతాయ్ – ప్రభాస్ కెరీర్‌లోనే బెస్ట్ మూవీ – రాజాసాబ్‌పై తమన్ మాస్ రివ్యూ


