సీనియర్ నటులు రాజీవ్ కనకాల, ఝాన్సీ ప్రధానపాత్రల్లో నటించిన ‘హోమ్ టౌన్’(Home Town Teaser) సిరీస్ టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఆద్యంతం నవ్వుకునేలా టీజర్ రూపొందించారు. ఈ టీజర్ చూస్తుంటే చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుకుతెస్తోంది. ‘కలలు ప్రారంభమయ్యే ప్రాంతం.. మొదటి ప్రేమను అనుభవించే చోటు.. ఎప్పటికీ నిలిచిపోయే స్నేహం’ అంటూ విడదీయరాని స్నేహాలు, కుటుంబ విలువలు తెలిసేలా ఈ సిరీస్ రూపొందించినట్లు మేకర్స్ తెలిపారు. నవీన్ మేడారం సమర్పణలో శ్రీకాంత్ పల్లె దర్శకత్వం వహించారు. ఆహా ఓటీటీ వేదికగా ఏప్రిల్ 4 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
Home Town Teaser: చిన్ననాటి జ్ఞాపకాలతో ‘హోమ్ టౌన్’ టీజర్
సంబంధిత వార్తలు | RELATED ARTICLES