Friday, November 22, 2024
Homeచిత్ర ప్రభHrithik Roshan 2nd marriage: సెకెండ్ మ్యారేజ్ కు హృతిక్ రోషన్ రెడీ

Hrithik Roshan 2nd marriage: సెకెండ్ మ్యారేజ్ కు హృతిక్ రోషన్ రెడీ

ఎట్టకేలకు తన గర్ల్ ఫ్రెండ్ ను హృతిక్ రోషన్ పెళ్లి చేసుకోబోతున్నారు. సబా ఆజాద్ అనే హీరోయిన్ తో గత కొంత కాలంగా గ్రీక్ గాడ్ రిలేషన్ లో ఉన్నారు. ఇప్పటికే వీళ్లిద్దరూ ఓపన్ గా ప్రపంచమంతా తిరిగేస్తున్నారు. ఈ ఏడాది నవంబర్ లో వీరు అధికారికంగా పెళ్లి చేసుకోనున్నారు. దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ ఈ విషయాన్ని బాలీవుడ్ సర్కిల్ లో గట్టిగానే చెప్పుకుంటున్నారు. గత కొన్నేళ్లుగా బాలీవుడ్ లో పెళ్లిళ్లు చేసుకుంటున్నట్టు హీరోలు, హీరోయిన్స్ అఫిషియల్ గా చెప్పటం లేదు. ఈనేపథ్యంలో హృతిక్ కూడా ఇలాగే సైలెంట్ గా పెళ్లి చేసేసుకుని మీడియాకు స్వీట్లు పంచటం ఖాయమని ఫిల్మీ దునియాలో పుకార్లు గుప్పుమంటున్నాయి.

- Advertisement -

హృతిక్ తన చిన్ననాటి ఫ్రెండ్ అయిన సుజానే ఖాన్ ను పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు మగపిల్లలకు తల్లితండ్రులయ్యాక వీళ్ల మధ్య అభిప్రాయ బేధాలు వచ్చి విడాకులు తీసుకున్నారు. అయినా తమ పిల్లల కోసం తరచూ వీళ్లు కలిసే టూర్స్ కొడుతుంటారు. ఆమధ్య హృతిక్-సుజానే మళ్లీ పెళ్లి చేసుకుని డైవర్స్ రద్దు చేసుకుంటారనే పుకారు వచ్చినా సుజానే మరో నటుడితో సెటిల్ అయిపోయారు. ఇప్పుడు హృతిక్ కూడా ఇక అఫిషియల్ గా రియల్ లైఫ్ లో సెటిల్ అయ్యేలా కనిపిస్తోంది. ‘ఫైటర్’ అనే సినిమాలో దీపికతో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేస్తున్న హృతిక్ ‘వార్ 2’ సినిమాలోనూ నటిస్తున్నారు.

హృతిక్ రోషన్ ఫ్యామిలీ ఫోటో, సుసానే, ఇద్దరు కుమారులు (పాత ఫోటో)
సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News