Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభWar 2 Run Time: వార్ 2.. మ‌రీ అంత ర‌న్ టైమా!

War 2 Run Time: వార్ 2.. మ‌రీ అంత ర‌న్ టైమా!

War 2 Duration: ఇప్పుడు ఇండియ‌న్ సినీ ఇండ‌స్ట్రీ బాక్సాఫీస్ ఆగ‌స్ట్ 14 కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తోంది. అందుకు కార‌ణం ఒక‌టి కాదు.. ఏకంగా రెండు క్రేజీ ప్రాజెక్టులు ఆ రోజున రిలీజ్ అవుతుండ‌ట‌మే కార‌ణం. ఆ సినిమాలేవో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఒక‌టి వార్ 2 కాగా మ‌రో మూవీ కూలీ. రెండు సినిమాల్లో వార్ 2 విష‌యానికి వ‌స్తే బాలీవుడ్ నిర్మాణ సంస్థ య‌శ్ రాజ్ ఫిల్మ్స్ దీన్ని నిర్మించిన‌ప్ప‌టికీ ఇందులో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ క‌థానాయ‌కుడిగా న‌టించ‌ట‌మే ఈ క్రేజ్‌కు అస‌లు కార‌ణ‌మ‌ని చెప్పాలి. బాలీవుడ్ త‌ర్వాత అతి పెద్ద మార్కెట్ అయిన టాలీవుడ్‌ను టార్గెట్‌గా పెట్టుకున్న ఆదిత్య చోప్రా యంగ్ టైగ‌ర్‌ను ఇందులో ప్ర‌తినాయ‌కుడి పాత్ర‌కు ఎంచుకోవ‌టం కొస మెరుపు. RRR‌, దేవ‌ర చిత్రాల‌తో తార‌క్ బాలీవుడ్ ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌రైన‌ప్ప‌టికీ వార్ 2 మూవీ ఆయ‌న న‌టిస్తోన్న తొలి స్ట్ర‌యిట్ బాలీవుడ్ మూవీ కావ‌టం ఆయ‌నకెంతో ప్ర‌త్యేకం. దీని కోసం అభిమానుల‌తో పాటు తార‌క్ కూడా ఆస‌క్తిగానే వెయిట్ చేస్తున్నార‌నేది కాద‌న‌లేని స‌త్యం.

- Advertisement -

సినిమా వ్య‌వ‌ధి మ‌రీ అంత‌నా!
ఇప్పుడు సినిమా ర‌న్ టైమ్ రెండున్న‌ర గంట‌లుంటే ఓకే. కానీ రీసెంట్ టైమ్‌లో ప‌రిస్థితులు మారుతున్నాయి. కంటెంట్‌ను బేస్ చేసుకుని ద‌ర్శ‌క నిర్మాత‌లు భారీ ర‌న్ టైమ్స్‌ను లాక్ చేస్తున్నారు. రాజ‌మౌళి, సుకుమార్‌, సందీప్ రెడ్డి వంగా వంటి ద‌ర్శ‌కుల సినిమాలు దాదాపు మూడు గంట‌ల పైచిలుకే ఉంటున్నాయి. ఇప్పుడు వార్ కూడా అలాంటి డ్యూరేష‌న్ అని టాక్ వినిపిస్తోంది. సినీ స‌ర్కిల్స్‌లో వినిపిస్తోన్న స‌మాచారం మేర‌కు వార్ 2 ర‌న్ టైమ్ 2 గంట‌ల 53 నిమిషాలు. అంటే దాదాపు మూడు గంట‌లన్న‌మాట‌. అయితే సినిమా ఆస‌క్తిక‌రంగా ఉంటే ప్రేక్ష‌కుడు ర‌న్‌టైమ్‌ను పట్టించుకోడు. ఏమాత్రం తేడా కొట్టినా, ఆడియెన్స్ ర‌న్ టైమ్‌పై విసుగుని ప్ర‌ద‌ర్శిస్తే, విమ‌ర్శ‌కులు ర‌న్ టైమ్‌ను కూడా టార్గెట్ చేస్తార‌నే సందేహం లేదు. సినిమా రిలీజై ఒక‌వేళ మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంటే అప్పుడు ర‌న్ టైమ్‌ను ట్రిమ్ చేయ‌టం కంటే ముందే మేక‌ర్స్ ఆ విష‌యంలో ఆలోచించుకోవాల్సిన ఆవ‌శ్య‌క‌త ఎంతైనా ఉంద‌ని ఈ మ‌ధ్య వ‌చ్చిన సినిమాల‌ను గ‌మ‌నిస్తే అర్థ‌మ‌వుతుంది.

Also Read –Temporary Halt on Teacher Promotions in Telangana Amid Legal Dispute

భారీ టార్గెట్‌తో..
నిజానికి వార్ 2పై పెద్ద‌గా తెలుగు రాష్ట్రాల్లో అంచ‌నాలు లేవు. అయితే తార‌క్ కోసం ఎప్పుడైతే నిర్మాత నాగ‌వంశీ రంగంలోకి దిగాడో అప్పుడు లెక్క‌లు మారిపోయాయి. ఈ యంగ్ ప్రొడ్యూస‌ర్ ఏకంగా రూ.80 కోట్ల‌తో తెలుగు రైట్స్ సొంతం చేసుకున్నార‌ని ట్రేడ్ వ‌ర్గాలంటున్నాయి. ఇదే క‌నుక నిజ‌మైతే, నిజంగా నాగ‌వంశీ రిస్క్ చేస్తున్నాడ‌టంలో సందేహం లేదు. ఎందుకంటే రూ.80 కోట్లు షేర్ క‌లెక్ష‌న్స్ రావాలంటే సినిమా రూ.160 కోట్ల‌కు పైగానే వ‌సూళ్ల‌ను రాబ‌ట్టాలి. మ‌రి తెలుగు రాష్ట్రాల్లో హృతిక్‌, ఎన్టీఆర్ మ్యాజిక్, కియారా అద్వానీ గ్లామ‌ర్ ట్రీట్ ఏ మేర‌కు వ‌ర్క‌వుట్ అవుతుందో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.

Also Read – Modi China Visit : బ్రిక్స్​పై ట్రంప్​ గురి – చైనాకు మోదీ పయనం.. డ్రాగన్​తో దోస్తీనా ? కుస్తీనా?

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad