WAR 2 Story: ఈ ఏడాది బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్ ఫ్యాన్స్ అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో వార్ 2 ఒకటి. ఈ స్పై యాక్షన్ మూవీతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. హృతిక్ రోషన్ మరో హీరోగా నటిస్తున్న ఈ మూవీ ఆగస్ట్ 14న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కాబోతుంది.
నెల రోజుల ముందుగానే…
హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కాంబోలో ఫస్ట్ టైమ్ తెరకెక్కిన ఈ మూవీపై ఎక్స్‌పెక్టేషన్స్ ఓ రేంజ్‌లో ఉన్నాయి. రిలీజ్‌కు మరో నెల రోజుల సమయం ఉండగానే వార్ 2 థియేట్రికల్, ఓటీటీ బిజినెస్ మొత్తం క్లోజ్ అయిపోయింది. ఓపెనింగ్స్‌లో బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లో ఇప్పటివరకు ఉన్న రికార్డులను వార్ 2 తిరగరాయడం ఖాయమని ట్రేడ్ వర్గాలు చెబుతోన్నాయి. ఇటీవల రిలీజైన టీజర్‌లో హృతిక్ రోషన్‌కు ధీటుగా స్టైలిష్ లుక్‌లో ఎన్టీఆర్ కనిపించాడు. యాక్షన్, హీరోయిజంలో హృతిక్‌కు గట్టి పోటీ ఇచ్చాడు.
Also Read – Watch video: విమానంలో ఇంధన స్విచ్‌లు ఎలా పనిచేస్తాయో తెలుసా? ఇదిగో వీడియో..
హృతిక్ రోషన్ నెగెటివ్ రోల్…
ఇండియాతో పాటు ఓవర్‌సీస్‌లో ఆన్‌లైన్ టికెట్ బుకింగ్స్ యాప్‌లలో వార్ 2 స్టోరీలైన్‌ను సినాప్సిస్ రూపంలో చిన్నగా అప్‌డేట్ చేశారు. ఇప్పటివరకు ఈ సినిమాలో విలన్‌గా ఎన్టీఆర్ పేరు వినిపిస్తూ వచ్చింది. కానీ ఈ సినాప్సిస్‌లో మాత్రం హృతిక్ రోషన్ నెగెటివ్ షేడ్స్‌తో కూడిన క్యారెక్టర్‌లో కనిపించబోతున్నట్లు ఉంది.
వార్ 2 స్టోరీ ఇదే…
ఇండియాకు యాంటీగా మారిన కబీర్ (హృతిక్ రోషన్) దేశంలో కుట్రలు పన్నుతుంటాడు. ఎవరికి దొరక్కుండా తప్పించుకొని తిరుగుతుంటాడు. కబీర్‌ను పట్టుకోవడానికి మోస్ట్ వయలెంట్ స్పెషల్ ఆఫీసర్ ఏజెంట్ విక్రమ్ (ఎన్టీఆర్) రంగంలోకి దిగుతాడు. కబీర్ కంటే డేంజరస్‌గా పేరుతెచ్చుకుంటాడు విక్రమ్. కబీర్‌ను అంతం చేయడమే లక్ష్యంగా విక్రమ్ ఆపరేషన్ మొదలవుతుంది. ఆ తర్వాత ఏమైంది. విక్రమ్, కబీర్ మధ్య జరిగిన వార్‌లో విన్నర్ ఎవరయ్యారు? అన్నదే ఈ సినిమా కథగా సినాప్సిస్‌లో కనిపిస్తోంది.
రొటీన్ కానీ…
సినాప్సిస్ చూస్తుంటే రొటీన్ స్టోరీలైన్‌తోనే వార్ 2 తెరకెక్కుతోన్నట్లు కనిపిస్తోంది. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కాంబినేషన్‌తో పాటు వారిద్దరి ఇమేజ్, యాక్షన్ సీక్వెన్స్‌లు, హీరోయిజం, ఎలివేషన్లను నమ్ముకొనే ఈ సినిమాను రూపొందించినట్లు అర్థమవుతోందని ఫ్యాన్స్ అంటున్నారు. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ మధ్య వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ నెక్స్ట్ లెవెల్‌లో ఉండబోతున్నట్లు సమాచారం.
Also Read – Jagan: సరోజా దేవి మరణంపై స్పందించిన జగన్!
కియారా అద్వానీ హీరోయిన్…
వార్ 2 మూవీకి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నాడు. కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. అతడే ఈ సినిమాకు కథను అందించడం గమనార్హం. ఈ బాలీవుడ్ డెబ్యూ మూవీ కోసం ఎన్టీఆర్ అరవై కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకున్నట్లు సమాచారం. కాగా ఎన్టీఆర్‌కు తెలుగులో ఉన్న క్రేజ్ కారణంగా వార్ 2 తెలుగు రైట్స్ రికార్డు ధర పలికాయి. దాదాపు 80 కోట్లకు తెలుగు థియేట్రికల్ రైట్స్‌ను నిర్మాత సూర్యదేవర నాగవంశీ దక్కించుకున్నట్లు సమాచారం.


