టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్(NTR)పై బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ (Hrithik Roshan) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హృతిక్, తారక్ కలిసి ‘వార్ 2’ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఓ ఈవెంట్‌లో పాల్గొన్న హృతిక్ మాట్లాడుతూ..‘‘ఒక పాట మినహా ‘వార్2’ షూటింగ్ అంతా పూర్తయ్యింది. నాకు ఇష్టమైన సహనటుడు ఎన్టీఆర్. గొప్ప నటుడు. మా సినిమా అద్భుతంగా వచ్చింది. ఆగస్టు 14న థియేటర్‌లలోకి రానుంది. దీనికోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’’ అని చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కాగా హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ హీరోలుగా తెరకెక్కిన ‘వార్’ చిత్రం బాక్సాఫీసు వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. దీనికి సీక్వెల్‌గా ‘వార్2’ (War 2) తెరకెక్కుతుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ రా ఏజెంట్‌గా నటించనున్నట్లు తెలుస్తోంది. భారీ యాక్షన్ చిత్రంగా యశ్‌రాజ్ ఫిల్మ్స్ సంస్థపై అయాన్ ముఖర్జీ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు.