Prashanth Neel – Dragon: ఎన్టీఆర్ అభిమానులతో పాటు యాక్షన్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులు అలాగే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు.. ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న క్రేజీ మూవీ ‘డ్రాగన్'(పరిశీలనలో ఉన్న టైటిల్). కేజీఎఫ్ సిరీస్, సలార్ వంటి ఇండియాస్ మోస్ట్ బిగ్గెస్ట్ యాక్షన్ సినిమాలను రూపొందించిన దర్శకుడు ప్రశాంత్ నీల్ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. త్రిపులార్, దేవర సినిమాల క్రేజ్‌తో బాలీవుడ్ లోనూ ఎంట్రీ చేస్తున వార్ 2 ఆగస్టు 14న భారీ స్థాయిలో రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో డ్రాగన్ సినిమాపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి.
ఎన్టీఆర్, నీల్ కాంబినేషన్‌లో మొదలైన ఈ సినిమా గురించి రోజుకో వార్త వచ్చి హైప్ ని ఊహకందనంతగా పెంచేస్తున్నాయి. ఇంతకముందు ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ కోసం వేసిన సెట్ గురించి అటు ఇండస్ట్రీ వర్గాలలో ఇటు అభిమానుల్లో ఆసక్తికరమైన చర్చ సాగింది. అంతేకాదు, ఈ యాక్షన్ సీన్ కోసం ఏకంగా రెండు వేల మంది జూనియర్ ఆర్టిస్టులను, ఫైటర్స్‌ను రంగంలోకి దించారనే వార్తలు కూడా తెగ వైరల్ అయ్యాయి. దీనికి సంబంధించిన పిక్ కూడా నెట్టింట హల్‌చల్ చేసింది.
ALSO READ: https://teluguprabha.net/cinema-news/puri-jagannath-missed-the-ismart-beauties/
డ్రాగన్ నుంచి ఇలా యాక్షన్ సీన్స్ విషయంలో ఎప్పటికప్పుడు వస్తున్న వార్తలు అందరినీ అబ్బురపరుస్తున్నాయి. దీనికి కారణం సలార్ లో ప్రభాస్ ని ప్రశాంత్ నీల్ ఎలివేట్ చేసిన విధానం. అసలు బాహుబలి మూవీలో కూడా ఇలా రాజమౌళి డార్లింగ్ ని చూపించలేదనే విషయాన్ని ఒప్పుకొని తీరాలి. ఇక తాజాగా ఎన్టీఆర్, నీల్ సినిమాలోని ఇంటర్వెల్ సీక్వెన్స్ గురించి ఆసక్తికరమైన చర్చ మొదలైంది.
లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం కేజీఎఫ్, సలార్ సినిమాలకి మించి ఎవరూ ఊహించని రేంజ్‌లో ఈ ఇంట్రవెల్ సీక్వెన్స్ ఉంటుందని చెప్పుకుంటున్నారు. ఈ సమాచారం కూడా కన్నడ ఇండస్ట్రీ నుంచి అందుతోంది. ఇంటర్వెల్ కి ముందు వచ్చే యాక్షన్ సీక్వెన్స్‌లో మార్షల్ ఆర్ట్స్ నిపుణులను ఉపయోగిస్తున్నారనేది తాజాగా అబ్దిన సమాచారం. అంటే అపరిచితుడు సినిమాలో ఉన్న హై ఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ రేంజ్‌లో.
దీని కొసం భారీ సంఖ్యలో నిజమైన మార్షల్ ఆర్ట్స్ ఆర్టిస్టులను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఈ మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో వచ్చే ఫైట్ డ్రాగన్ సినిమా మొత్తానికి హైలైట్‌గా నిలుస్తుందట. ఎన్టీఆర్ కెరీర్‌లో ఫైట్ ఎంతో స్పెషల్‌గా నిలువబోతుందని అభిమానులు చెప్పుకుంటున్నారు. మరో మాటా వినిపిస్తోంది. ఇకపై ఇండియన్ సినిమాలలో ఏదైనా భారీ యాక్షన్ సీక్వెన్స్ తీయాలంటే దీనినే ఇన్సిపిరేషన్‌గా తీసుకోవడం జరుగుతుందని టాక్. మరి, ప్రశాంత్ నీల్ ఏ రేంజ్‌లో ఈ యాక్షన్ సీక్వెన్స్‌ని ఎంత స్టైలిష్‌గా ప్లాన్ చేస్తున్నారో సిల్వర్ స్క్రీన్ మీద చూస్తే గానీ ఆ థ్రిల్ నెక్స్ట్ లెవల్ అని ఫీలవుతామో చూడాలి.