బంజారా హిల్స్ లోని పార్క్ హయత్ హోటల్ లో రెండవ రోజు హైదరాబాద్ టైమ్స్ ఫ్యాషన్ వీక్’ ఆకట్టుకుంది. శ్రీ ఆదిత్య లగ్జరీ వింటేజ్ సమర్పణలో రెండు రోజుల ప్రదర్శనలో భాగంగా చివరి రోజు థీమ్ లతో డిజైనర్ తీర్చిదిద్దిన డిజైనర్ దుస్తులను మోడల్స్ ర్యాంపుపై ప్రదర్శించారు. ప్రదర్శనలో భాగంగా డిజైనర్లు ఎన్ఐఎఫ్ గ్లోబల్ స్టూడెంట్స్, అధ్వారియా సిల్క్స్, స్టార్ లైఫ్ షాఫీక్ రెహ్మాన్, మనసా స్టూడియో, రాజ్యలక్ష్మి గుబ్బ పల్లవి జైపూర్ మరియు సాహిల్ కచ్చర్ ప్రముఖ డిజైనర్స్ లకు చెందిన డిజైన్ కలెక్షన్స్ ప్రముఖ సినీతారలు రెజినా, ఈషా రెబ్బ మరియు బాలీవుడ్ నటి దియా మీర్జా షో స్టాపర్స్ గా మెరిశారు.
ర్యాంప్ వాక్ తో మోడల్స్ అందరినీ ఆకట్టుకున్నారు. దాదాపు 16 మంది డిజైనర్లు రూపొందించిన సరికొత్త డిజైన్లను ఈ రెండు రోజుల ప్రదర్శనలో చూపారు. నగరంతో పాటు ముంబై ఢిల్లీ ప్రాంతాలకు చెందిన మోడల్స్ పలువురు ఇక్కడ ర్యాంపుపై సందడి చేశారు.