Saturday, November 15, 2025
HomeTop StoriesiBOMMA: పోలీసులకు iBOMMA స్ట్రాంగ్ వార్నింగ్! మాపై దృష్టి పెడితే అంతే సంగతులు!

iBOMMA: పోలీసులకు iBOMMA స్ట్రాంగ్ వార్నింగ్! మాపై దృష్టి పెడితే అంతే సంగతులు!

టాలీవుడ్ vs iBOMMA

- Advertisement -

ఈ-పైరసీల పోరాటం ఇప్పుడు పీక్ స్టేజ్‌కి చేరుకుంది. తమ వెబ్‌సైట్‌పై పోలీసుల నిఘా పెరగడంతో, పైరసీ దిగ్గజం iBOMMA ఏకంగా తెలుగు చిత్ర పరిశ్రమకు వార్నింగ్ ఇస్తూ, సంచలన వ్యాఖ్యలతో కూడిన ఒక ఘాటు లేఖను విడుదల చేసింది. ఈ లేఖలో, తెలుగు హీరోల భారీ రెమ్యునరేషన్లు మొదలుకొని, నిర్మాతల డబుల్ గేమ్‌ వరకు… అన్నింటిపైనా iBOMMA ప్రశ్నల వర్షం కురిపించింది!

అసలు ఫోకస్ ఎవరిపై ఉండాలి?

iBOMMA యొక్క ప్రధాన ప్రశ్న ఒక్కటే: “మీరు iBOMMA మీద ఫోకస్ చేస్తే, మేము ఎక్కడ ఫోకస్ చేయాలో అక్కడ చేస్తాం!”

టాలీవుడ్ పెద్దలంతా పైరసీ నివారణ కోసం పోలీసులతో కలిసి చర్చలు జరుపుతున్న తరుణంలో, iBOMMA చేసిన ఈ కౌంటర్ అటాక్ ఊహించనిది. పోలీసులు తమపై కాకుండా, కెమెరా ప్రింట్స్ రిలీజ్ చేసే వేరే వెబ్‌సైట్స్ మీద దృష్టి పెట్టాలని డిమాండ్ చేసింది. అంతేకాదు, “బురదలో రాయి వేయకండి… మేము అంత మంచి వాళ్ళం కాదు” అంటూ హెచ్చరించారు

ALSO READ: https://teluguprabha.net/cinema-news/dimple-hayathi-harassment-case-after-dcp-car-controversy/

హీరోల కోట్లు vs. సామాన్యుడి కష్టం!

“హీరోలకు అంత భారీ రెమ్యునరేషన్స్ ఎందుకు? సినిమాకి పనిచేసేది హీరో, హీరోయిన్లు మాత్రమేనా?”
“సినిమా కార్మికులకు మీరు ఇచ్చే రెమ్యునరేషన్స్… వాళ్లు ఏ కూలి పని చేసినా వస్తాయి! అనవసరంగా బడ్జెట్ పెంచేసి, దాన్ని రికవరీ చేయడానికి టికెట్ ధరలు పెంచి… మధ్యతరగతిపై భారం మోపుతున్నారు.”
“విదేశాల్లో షూటింగ్స్ చేయాల్సిన అవసరం ఏంటి? అంతా అనవసర బడ్జెట్ భారం తప్ప!” అంటూ చెప్పుకుంటూ వచ్చింది.

నిర్మాతల నాటకం: డబుల్ గేమ్ ఆడుతున్నారా?

నిర్మాతలు మరియు డిస్ట్రిబ్యూటర్లు ఆడుతున్న ‘గేమ్’పై iBOMMA తీవ్ర స్థాయిలో మండిపడింది.”నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్స్‌కు ప్రింట్స్ అమ్మి, ఆ తర్వాత ఏమీ పట్టనట్లు ఓటీటీలో ఎలా సొమ్ము చేసుకోవాలా అని ఆలోచిస్తున్నారు.” ఈ ప్రక్రియలో తాము బలిపశువులం అవుతున్నామని iBOMMA ఆవేదన వ్యక్తం చేసింది. గతంలో ‘ఖుషి’, ‘కింగ్‌డమ్’ లాంటి సినిమాల సమయంలోనూ, నిర్మాతలు కొందరు ఏజెంట్లకు డబ్బులిచ్చి, iBOMMA పేరుతో ఫేక్ వెబ్‌సైట్స్ సృష్టిస్తున్నారనే ఆరోపణలు కూడా చేసింది.

ALSO READ: https://teluguprabha.net/cinema-news/gv-prakash-kumar-and-saindhavi-ended-their-12-years-marriage-life-with-divorce/

ఫైనల్ వార్నింగ్: మేము ఏ దేశంలో ఉన్నా తెలుగు వారి కోసం ఆలోచిస్తాం, చావుకు భయపడని వాడు దేనికీ భయపడడు!
ఈ వార్నింగ్ ద్వారా, తమపై ఒత్తిడి పెరిగితే తాము మరింత ప్రమాదకరంగా మారతామని iBOMMA చెప్పకనే చెప్పింది. పైరసీని అరికట్టేందుకు చిరంజీవి, వెంకటేష్, నాగార్జున వంటి స్టార్స్ పోలీసులతో భేటీ అవుతున్న ఈ సమయంలో, ఈ సంచలన లేఖ టాలీవుడ్ వర్గాల్లో టెన్షన్ పెంచుతోంది. iBOMMA సవాల్‌ను టాలీవుడ్ పెద్దలు, పోలీసులు ఎలా ఎదుర్కొంటారో చూడాలి!

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad