Saturday, November 15, 2025
HomeTop StoriesIDLI KOTTU MOVIE REVIEW: ఇడ్లీ కొట్టు రివ్యూ, చట్నీ కొంచెం చప్పగా ఉంది?

IDLI KOTTU MOVIE REVIEW: ఇడ్లీ కొట్టు రివ్యూ, చట్నీ కొంచెం చప్పగా ఉంది?

పల్లెటూరి పిల్లాడి పంతం!

- Advertisement -

IDLI KOTTU: శంకరపురం అనే పల్లెటూరిలో ఒక ముసలి దేవుడిలా, తన ఇడ్లీ కొట్టుని నమ్ముకుని బతుకుతుంటాడు శివ కేశవుడు (రాజ్‌కిరణ్). ఆయనకి ఆ కొట్టే లోకం, ఆ ఇడ్లీనే ఆస్తి! కానీ, ఆయన కొడుకు మురళి (ధనుష్) కలలు అన్నీ ఆకాశంలో ఉంటాయి. పల్లె కాదు, పట్నం కావాలి, అక్కడ లగ్జరీ లైఫ్ కావాలి! హోటల్ మేనేజ్‌మెంట్ చదివి, బ్యాంకాక్‌లో తిరుగులేని AFC ఫుడ్ సామ్రాజ్యం నడిపే విష్ణువర్ధన్ (సత్యరాజ్) దగ్గర పార్టనర్ అవుతాడు. మురళి నిజాయితీకి, పనితీరుకి పడిపోయిన విష్ణువర్ధన్…

ALSO READ: https://teluguprabha.net/cinema-news/tollywood-september-2025-best-month-og-mirai-hits/

తన కూతురు మీరా (షాలినీ పాండే)ని మురళికే ఇచ్చి పెళ్లి చేయాలని డిసైడ్ అవుతాడు!
కానీ.. ఈ కథలో ఊహించని ట్విస్ట్! ఒక సడన్ సంఘటన మురళిని తిరిగి తన ఊరు, తన ఇడ్లీ కొట్టు దగ్గరికి లాక్కొస్తుంది. అక్కడి నుంచి, ఆ పల్లెటూరి పిల్లాడు తన తండ్రి కలను ఎలా నెరవేర్చాడు… ఆ అడ్డు వచ్చిన విలన్ల ఆట ఎలా కట్టించాడు అనేది అసలు కథ!

⁠సినిమా ప్లస్ పాయింట్లు:

ఎమోషన్స్ గురూ ఎమోషన్స్! కథ సింపుల్‌గా ఉన్నా, రాజ్‌కిరణ్-ధనుష్ మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ అయితే గుండెల్ని పిండేస్తాయి! ఫస్ట్ హాఫ్‌లో ఆ తండ్రీ కొడుకుల అనుబంధం చూస్తే కళ్లలో నీళ్లు తిరుగుతాయి పక్కా! ధనుష్ అంటే మామూలు కాదుగా! పల్లెటూరి కుర్రాడిగా ధనుష్ నటనలో న్యాచురల్ ఫ్లేవర్ అద్ది, జీవించేశాడు! ముఖ్యంగా ఎమోషనల్ సీక్వెన్స్‌లలో ఆయన పెర్ఫార్మెన్స్ ప్రాణం పోస్తుంది.

నిత్యా మీనన్ మాయ! ధనుష్ లవ్ ఇంట్రెస్ట్‌గా నిత్యా మీనన్ నటన కూడా సూపర్ గా ఉంది. ఈ ఇద్దరి కెమిస్ట్రీ మరోసారి చక్కగా కుదిరింది.

ALSO READ: https://teluguprabha.net/cinema-news/ibomma-final-warning-tollywood-remunerations-and-hikes/

మొత్తంగా చెప్పాలంటే:

“ఇడ్లీ కొట్టు” ఒక స్లో-పేస్డ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్.
ఫస్ట్ హాఫ్ లో వచ్చే ఎమోషనల్ సీన్స్ అయితే అదుర్స్! కానీ, సెకండాఫ్ వచ్చేసరికి, కథ ఎటెటో వెళ్లి… రొటీన్ హీరో-విలన్ ఫైట్ లాగా మారిపోయింది. అదే సినిమాపై ఇంపాక్ట్‌ను తగ్గించేసింది.
ధనుష్ అండ్ కో పర్ఫార్మెన్స్‌లు బాగున్నా, కథ పాతదే కావడం, సెకండాఫ్ డల్ అవ్వడం వల్ల ‘ఓకే’ అనిపించే సినిమాగా మిగిలింది. ఫ్యామిలీ ఎమోషన్స్ ఇష్టపడేవాళ్లు ఒకసారి ట్రై చేయొచ్చు!

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad