ప్రధాని మోదీ(PM Modi)ని ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా(Ilaiyaraaja) కలిశారు. ఢిల్లీలోని ప్రధాని కార్యాలయంలో ఆయనతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మోదీని ఇళయరాజా శాలువాతో సత్కరించారు. అనంతరం ఇద్దరు పలు అంశాలపై చర్చించారు.
- Advertisement -
ఈమేరకు సంబంధింత ఫొటోలను ఇళయరాజా సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ‘‘మోదీ గారితో ఎప్పటికీ మర్చిపోలేని సమావేశమిది. నా ‘సింఫొనీ- వాలియంట్’ సహా పలు అంశాలపై చర్చించాం. ఆయన ప్రశంసలు, మద్దతుకు కృతజ్ఞుడిని’’ అని పేర్కొన్నారు.

కాగా లండన్‌లో ఇటీవల ఇళయరాజా ‘వాలియంట్’ పేరిట మ్యూజికల్ ఈవెంట్ నిర్వహించిన సంగతి తెలిసిందే. దీంతో లండన్‌లో వెస్ట్రన్ క్లాసికల్ సింఫొనీ నిర్వహించిన తొలి ఆసియా మ్యూజిక్ కంపోజర్‌గా రికార్డు సృష్టించారు.