తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ హీరోగా నటించిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ (Good Bad Ugly) మేకర్స్‌కు ప్రముఖ సంగీత దర్శకుడు, మ్యాస్ట్రో ఇళయరాజా (Ilaiyaraaja) లీగల్ నోటీసులు పంపారు. గతంలో తాను సంగీతం అందించిన మూడు గీతాలను ఈ మూవీలో అనుమతి లేకుండా రీక్రియేట్ చేశారని నోటీసుల్లో పేర్కొన్నారు. ఇందుకు రూ.5 కోట్ల పరిహారం డిమాండ్ చేశారు. అంతేకాకుండా వెంటనే సినిమాలో ఆ పాటలను తొలగించి మేకర్స్ క్షమాపణ చెప్పాలని కోరారు.
కాగా అజిత్ (Ajith) హీరోగా దర్శకుడు అధిక్ రవిచంద్రన్ తెరకెక్కించిన ఈ యాక్షన్ కామెడీ మూవీ ఈ నెల 10న విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ తెచ్చుకుని రికార్డ్ స్థాయి కలెక్షన్స్ రాబడుతోంది. ఈ నేపథ్యంలో మూవీ యూనిట్‌కు ఇళయరాజా నోటీసులు పంపించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.