South Indian Heroines: సినీ ఇండస్ట్రీ అంటే ఒక్క నటన మాత్రమే కాదు… గ్లామర్, మార్కెట్, సోషల్ మీడియా ఫాలోయింగ్ – ఇవన్నీ కలిసే ఒక హీరోయిన్‌కి క్రేజ్ తీసుకురాగలవు. బాలీవుడ్ హీరోయిన్లు ఈ విషయంలో చాలా అడ్వాన్స్‌లో ఉన్నట్టు కనిపిస్తుంటే, దక్షిణాది తారలు మాత్రం కొంచెం వెనుకబడుతున్నారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మరి నిజంగానే దక్షిణాది భామలు గ్లామర్ రేసులో వెనకబడుతున్నారా? లేదంటే వాళ్లకు ఉన్న ప్రత్యేకత వేరు అని అనుకోవాలా? ఆ వివరాలపై ఓ లుక్కేద్దాం..
ఈ రోజుల్లో ఒక హీరోయిన్‌గా నిలదొక్కుకోవడం అంటే మామూలు విషయం కాదు. నటన మాత్రమే కాదు, గ్లామర్, స్టైల్, సోషల్ మీడియా ప్రెజెన్స్ అన్నీ కలిసే ఇమేజ్‌ను బలంగా నిలబెట్టాలి. బాలీవుడ్ తారలు దీన్ని బాగా అర్థం చేసుకొని, తమ ప్రతి సినిమాకూ గ్లామర్ అస్త్రాన్ని వాడుతున్నారు. ఇక దక్షిణాది ఇండస్ట్రీలో కూడా ఇదే ట్రెండ్‌పై చర్చ జరుగుతోంది.
ఇటీవల బాలీవుడ్ హీరోయిన్లు తమ గ్లామర్‌ను ప్రమోషన్స్‌లో స్ట్రాటజిక్‌గా వాడుకుంటున్నారు. జాన్వి కపూర్ “పరం సుందరి” సాంగ్‌లో రైన్ లుక్… కియారా అద్వానీ “వార్ 2” ఫ్యాషన్ స్టేట్‌మెంట్స్ .. ఇవన్నీ దక్షిణాదిలోనూ మంచి హైప్ క్రియేట్ చేశాయి. ఇది కేవలం వైరల్ కానే కాదు, సినిమాలకు బజ్ తీసుకొచ్చే టూల్‌గా మారుతోంది.
Also Read – Mythological Movies : పౌరాణికాల చుట్టూ తిరుగుతోన్న సినీ ఇండస్ట్రీ
దక్షిణాది భామల విషయానికి వస్తే, నటన పరంగా టాప్ క్లాస్ అయితేనేం, గ్లామర్ విషయంలో మాత్రం కొంత వెనుకపడుతున్నట్టే కనిపిస్తోంది. రష్మిక మందన్న మాత్రమే ఇప్పటివరకు బాలీవుడ్ గ్లామర్ లెవల్స్‌కి టఫ్ ఫైట్ ఇస్తోంది. కానీ నయనతార, సమంత, కీర్తి సురేష్, పూజా హెగ్డే లాంటి స్టార్‌లు ఎక్కువగా పెర్ఫార్మెన్స్ లేదా ఫ్యామిలీ ఫ్రెండ్లీ ఇమేజ్‌కే పరిమితం అవుతున్నారు. ఫలితంగా గ్లామర్ రేసులో బాలీవుడ్ తారలు దూసుకుపోతున్నారని చెప్పాల్సిందే.
కొత్తగా ఇండస్ట్రీలోకి వస్తున్న కొన్ని దక్షిణాది హీరోయిన్లు గ్లామర్ విషయంలో కొత్త ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఇంకా బాలీవుడ్ స్టాండర్డ్‌కి చేరాలంటే దారి ఎంతో ఉంది. ఇక ఇప్పుడు పరిస్థితి స్పష్టంగా చెబుతోంది. ఈ హీరోయిన్లకు నటనతో పాటు గ్లామర్ కూడా కెరీర్‌ను మలిచే ముఖ్యమైన పాయింట్. బాలీవుడ్ తారలు ఈ విషయాన్ని ముందే పసిగట్టి ఉపయోగించుకుంటే, దక్షిణాది తారలు మాత్రం ఇంకా సెటిల్ కావాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో ఈ గ్లామర్ రేసులో సౌత్ హీరోయిన్లు తిరిగి పుంజుకుంటారా? లేక మరింత వెనుకబడిపోతారా? వేచి చూడాల్సిందే..!
Also Read – Chiranjeevi: అత్తగారి పాడె ఎత్తుకున్న మెగాస్టార్!


