Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభNarne Nithin: ఆసక్తిగా నార్నే నితిన్ ‘శ్రీ శ్రీ శ్రీ రాజావారు’ ట్రైల‌ర్

Narne Nithin: ఆసక్తిగా నార్నే నితిన్ ‘శ్రీ శ్రీ శ్రీ రాజావారు’ ట్రైల‌ర్

స్టార్ హీరో ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్(Narne Nithin) వరుస సినిమాలతో మంచి జోరు మీద ఉన్నాడు. అతడు నటించిన మ్యాడ్, మ్యాడ్ 2, ఆయ్ చిత్రాలు విజయాలు అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలతో యువతో ఫాలోయింగ్ తెచ్చుకున్న అతడు.. ప్రస్తుతం ‘శ్రీ శ్రీ శ్రీ రాజావారు’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ‘శతమానం భవతి’ మూవీ దర్శకుడు సతీష్ వేగేశ్న ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమాను శ్రీ వేదాక్షర మూవీస్ పతాకంపై చింతపల్లి రామారావు నిర్మిస్తున్నారు.

- Advertisement -

తాజాగా విడుదల చేసిన ఈ మూవీ ట్రైలర్‌ ఆసక్తిగా ఉంది. సిగరెట్‌కి అల‌వాట‌యిన ఒక యువ‌కుడి చుట్టూ క‌థ ఉండ‌బోతున్నట్లు ట్రైలర్‌లో చూపించారు. ఇక ఈ చిత్రంలో రావు రమేష్, శుభలేఖ సుధాకర్, నరేష్, రఘు కుంచె, ప్రవీణ్, రచ్చ రవి, సరియు, రమ్య, ప్రియ మచిరాజు, భద్రం, ఆనంద్, జబర్దస్త్ నాగి తదితరులు కీల‌క పాత్రల్లో న‌టిస్తున్నారు. కైలాష్ మీనన్ సంగీతం అందిస్తున్నాడు. కాగా జూన్ 6న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad