Kantara Chapter 1 Updates: పాన్ ఇండియా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న సినిమాల్లో కాంతార చాప్టర్ 1 ఒకటి. రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్నాడు. సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. దసరా సందర్భంగా సినిమాను అక్టోబర్ 2న తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. కాంతార చిత్రాన్ని తక్కువ బడ్జెట్‌తో రూపొందించిన హోంబలే ఫిల్మ్స్ సినిమాపై ఉన్న అంచనాలకు ధీటుగా ప్రీక్వెల్ ను వంద కోట్లకు పైగానే ఖర్చు పెట్టి నిర్మించింది.
కాన్సెప్ట్ ఏంటంటే..!
కాంతార ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి పాన్ ఇండియా లెవల్లో నాలుగు వందల కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టి బ్లాక్ బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ప్రీక్వెల్‌పై ఎలాంటి అంచనాలుంటాయనేది రిషబ్ శెట్టికి బాగా తెలుసు. అందువల్ల ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా డిఫరెంట్ కాన్సెప్ట్‌తో దీన్ని తెరకెక్కించాడు. ఇందులో ఆయన నాగ సాధువుగా కనిపించబోతున్నాడు. మహిమలున్న నాగ సాధువు వెనుకున్న కథనే ఈ ప్రీక్వెల్‌లో చూపించబోతున్నారు. బనవాసిలోని కదంబాస్ రాజవంశ పాలన నేపథ్యంలో సినిమా ఉంటుంది. దీని కోసం మేకర్స్ భారీ సెట్ వేసి ఓ కొత్త లోకాన్ని సృష్టించారు.
Also Read – IND vs PAK: భారత్-పాక్ హై వోల్టేజ్ మ్యాచ్ నేడే.. ఎక్కడ చూడొచ్చంటే?
తెలుగులో భారీ టార్గెట్..
కాంతార చాప్టర్ 1 మూవీపై ఉన్న అంచనాలకు తగ్గట్టుగానే అన్నీ భాషల్లో రైట్స్ ఫ్యాన్సీ రేటుకి అమ్ముడయ్యాయి. తెలుగు విషయానికి వస్తే ఏకంగా రూ.100 కోట్లకు రైట్స్ కొనుగోలు చేశారు. అంటే ఇప్పుడు సినిమా ఏకంగా తెలుగు వరకు రూ.200 కోట్లు వసూలు చేస్తేనే బ్రేక్ ఈవెన్ అవుతుంది. దసరాకు మరో సినిమా కూడా లేకపోవటం కాంతార చాప్టర్ 1కు బాగా కలిసొస్తుందని ట్రేడ్ వర్గాలంటున్నాయి. అన్నీ భాషల్లో కలిపి సినిమా వెయ్యి కోట్లు వసూలు చేసే అవకాశాలున్నాయని కూడా టాక్ నడుస్తోంది. ఈ ఏడాది భారీ అంచనాలు పెట్టుకున్న కూలీ, వార్ 2 సినిమాలు బోల్తా పడటంతో ఇప్పుడు అందరి దృష్టి కాంతార చాప్టర్ 1 పైనే ఉంది.
వివాదం..
కేరళలో కాంతార ప్రీక్వెల్‌కు కొత్త సమస్య వచ్చి పడింది. లాభాల్లో వాటా ఎక్కువ కావాలని ఎగ్జిబిటర్స్ యూనియన్ డిమాండ్ చేసింది. అయితే సినిమాను డిస్ట్రిబ్యూట్ చేస్తోన్న నటుడు, నిర్మాత పృథ్వీరాజ్ సుకుమారన్ మాత్రం 40 శాతం మాత్రమే ఇస్తానని అంటున్నాడు. దీంతో ఈ సినిమాను విడుదల చేయకూడదని కేరళలో ఎగ్జిబిటర్స్ యూనియన్ భావిస్తోంది.
Also Read – Health : ఊరికే అలసిపోతున్నారా..అయితే ఈ లోపంతో బాధపడుతున్నట్లే…!


