Sunday, July 7, 2024
Homeచిత్ర ప్రభPawan Kalyan: ‘వారసుడు’ ప్రి రిలీజ్ ఈవెంట్‌కు పవన్ వస్తున్నాడా? అసలు నిజం ఇదే!

Pawan Kalyan: ‘వారసుడు’ ప్రి రిలీజ్ ఈవెంట్‌కు పవన్ వస్తున్నాడా? అసలు నిజం ఇదే!

Pawan Kalyan: తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న తాజా చిత్రం ‘వారసుడు’. తమిళ్‌లో ‘వారిసు’గా రిలీజ్ అవుతోంది. తెలుగు దర్శకుడు పైడిపల్లి వంశీ రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని ‘స్టార్’ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నారు. రష్మిక మందన్నా కథా నాయికగా నటిస్తోంది.

- Advertisement -

థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన చిత్ర పాటలకు మంచి ఆదరణ వస్తోంది. సంక్రాంతికి విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్ర ప్రి రిలీజ్ ఈవెంట్ ఈ నెల చివర్లో జరిగే అవకాశం ఉంది. ఈ ఫంక్షన్‌కు ‘పవర్ స్టార్’ పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా హాజరవ్వబోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. దీంతో అటు పవన్ ఫ్యాన్స్.. ఇటు విజయ్ ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఈ ప్రచారంలో నిజం లేదని తెలుస్తోంది.

ప్రస్తుతానికి పవన్ ఈ వేడుకకు హాజరయ్యే అవకాశం లేదని విశ్వసనీయ వర్గాల సమాచారం. పవన్ కల్యాణ్‌ను చిత్ర యూనిట్ సంప్రదించలేదని తెలుస్తోంది. దీంతో ఇప్పటివరకు జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదు. అయితే, ఈ ఫంక్షన్‌కు ఇంకా చాలా రోజుల సమయం ఉంది కాబట్టి.. ఈ ప్రచారం నిజమయ్యే అవకాశాన్ని కొట్టిపారెయ్యలేం. ఈ చిత్ర తమిళ వెర్షన్‌కు సంబంధించి థియేటర్ల వివాదం కొనసాగుతోంది. తెలుగులో దిల్ రాజు ఎక్కువ థియేటర్లే సొంతం చేసుకున్నప్పటికీ, తమిళ్‌లో సమస్య ఎదురవుతోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News