Samantha: పాన్ ఇండియన్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఏం మాయ చేశావే సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. మొదటి సినిమాతోనే తిరుగులేని విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత ఒక్కో సినిమాతో సాలీడ్ హిట్ కొడుతూ స్టార్ హీరోయిన్ గా మారింది. తెలుగుతో పాటు తమిళంలోనూ భారీ స్థాయిలో అభిమానులను సంపాదించుకున్న సమంత, సౌత్ లోనే నంబర్ 1 పొజిషన్ చూసింది. తెలుగులో దాదాపు అందరు స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా నటించి ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది.
ఇక, మొదటి సినిమాలో తన సరసన నటించిన టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్యను పెళ్లి చేసుకుంది. పెళ్ళికి ముందు ఎంత గ్లామర్ పాత్రలు పోషించినా కూడా, పెళ్లి తర్వాత మాత్రం ‘మజిలీ’ లాంటి డీసెంట్ చిత్రాలతో ఆకట్టుకుంది. అయితే, ఏ ఒక్కరూ ఊహించని విధంగా చైతూ, సమంత విడాకులు తీసుకుంటున్నట్టుగా ప్రకటించి షాకిచ్చారు. ఒకదశలో వీరి విడాకుల విషయం పెద్ద హాట్ టాపిక్. ఆ తర్వాత సమంత ఆరోగ్య పరిస్థితి కూడా దెబ్బతినడం.. సినిమాలను మెల్లగా తగ్గిండం తెలిసిందే.
Also Read – Swara Bhaskar Controversy: బై సెక్సువల్ వివాదంపై క్లారిటీ ఇచ్చిన హీరోయిన్
కేవలం సౌత్ లో మాత్రమే కాకుండా, బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి వెబ్ సిరీస్ లు చేశారు. ప్రస్తుతం, సమంత టాలీవుడ్ లో నిర్మాతగా కొత్త ప్రయాణం మొదలుపెట్టారు. ఆమె నిర్మాణంలో వచ్చిన మొదటి సినిమా ‘శుభం’ అన్నీ వర్గాల ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. నిర్మాతగా మొదటి విజయం అందుకున్న సమంత, మరో సినిమాను నిర్మిస్తోంది. ఇక, తాజాగా సమంత దర్శకత్వం వైపు కూడా అడుగులు వేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు ఓ లేటెస్ట్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో లేడీ డైరెక్టర్స్ చాలా తక్కువ. కానీ, వాళ్ళు తీసిన సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి. అప్పట్లో విజయ నిర్మల హీరోయిన్‌గా నటిస్తూ దర్శకురాలిగా సక్సెస్ సాధించి, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో స్థానం సంపాదించారు. ఆ రూట్ లోనే ఇప్పుడు సమంత కూడా వెళ్ళాలనుకుంటున్నారు. ఇప్పటికే, హీరోయిన్‌గా నిర్మాతగా.. ప్రూవ్ చేసుకున్న సమంత, నిజంగా మెగా ఫోన్ పట్టుకుంటే మాత్రం మన తెలుగు ఇండస్ట్రీలోనే సపోర్ట్ చేసేందుకు చాలామంది ఉన్నారు. చూడాలి, మరి దీనికి సంబంధించిన కన్‌ఫర్మేషన్ ఎప్పుడొస్తుందో.
Also Read – Trump: ఫర్నీచర్ దిగుమతులపైనా.. మరో 50 రోజుల్లో సుంకాలపై ట్రంప్ నిర్ణయం


