Shruti Haasan: కమల్ హాసన్ నట వారసురాలు, సౌత్ స్టార్ హీరోయిన్ శృతి హాసన్ మన తెలుగు ఇండస్ట్రీకి దాదాపు గుడ్ బై చెప్పినట్టే అని ప్రస్తుతం సోషల్ మీడియాలో న్యూస్ ఒకటి సర్క్యులేట్ అవుతోంది. గత కొంతకాలంగా ఆమె సినిమాల ఎంపిక చూస్తే.. అదే నిజం అని కూడా అనిపిస్తోంది. వాల్తేరు వీరయ్య తర్వాత తెలుగులో సినిమాలు చేయాలనే ఆసక్తి చూపించట్లేదు శ్రుతికి. వాస్తవానికి అడివి శేష్ హీరోగా నటిస్తున్న ‘డెకాయిట్’ సినిమాలో ముందు శృతి హాసన్‌ని హీరోయిన్‌గా తీసుకున్నారు.
అయితే, ఈ సినిమా నుంచి శ్రుతి తప్పుకుంది. అప్పటికే, కొంత టాకీ పార్ట్ షూట్ కూడా జరిగింది. శ్రుతి పాత్రని పరిచయం చేస్తూ టీజర్ కూడా రిలీజ్ చేశారు. కానీ, ఏమైందో ఏమో, అనూహ్యంగా శృతి హాసన్ ప్లేస్ లో బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ వచ్చింది. మృణాల్ తెలుగులో ఆల్రెడీ ‘సీతారామం’ సినిమాతో ఎంట్రీ ఇచ్చి, మంచి హిట్ అందుకొని.. హాట్ టాపిక్ అయింది. ఆ తర్వాత, ‘హాయ్ నాన్న’ మూవీతో మరో హిట్ అందుకొని తెలుగులో బాగా పాపులర్ అయింది. ఆ తర్వాత, విజయ్ దేవరకొండతో చేసిన ఫ్యామిలీ స్టార్ మాత్రం మృణాల్‌కి షాకిచ్చింది.
Also Read – Kamal Haasan: కమల్‌హాసన్‌ను చంపేస్తా…టీవీ నటుడి బెదిరింపులు – కేసు నమోదు చేసిన పోలీసులు
‘ఫ్యామిలీ స్టార్’ తర్వాత మళ్ళీ మృణాల్‌కి తెలుగులో హీరోయిన్‌గా ఛాన్స్ వస్తుందని ఎవరూ ఊహించలేదు. అయితే, ‘డెకాయిట్’ సినిమాలో మాత్రం అనూహ్యంగా వచ్చిన అవకాశమే. దీనికి డేట్స్ ప్రధాన కారణమని చెప్తున్నారు. ఒకేసారి ఇటు ‘డెకాయిట్’.. అటు ‘కూలీ’ చేయాల్సి ఉండగా, పాన్ ఇండియా వైడ్‌గా భారీ మల్టీస్టారర్ మూవీగా రూపొందుతున్న ‘కూలీ’ సినిమాకే శ్రుతి హాసన్ కమిటైంది. ఇందులో.. కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్, టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున, కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర, బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్, తమిళ పాపులర్ నటుడు సత్యరాజ్ ప్రధాన పాత్రల్లో నటించారు.
సౌత్, నార్త్ స్టార్స్ ఉన్న ప్రాజెక్ట్ కాబట్టే, శృతి ‘కూలీ’కి డేట్స్ ఇచ్చి ‘డెకాయిట్’ ని పక్కన పెట్టేసింది. వాస్తవానికి శ్రుతి లాంటి హీరోయిన్ మేకర్స్‌ని డేట్స్ సర్దుబాటు చేయమని అడిగితే ‘నో’ అనే ఛాన్సే లేదు. కానీ, తనకి ‘డెకాయిట్’ మీద ఇంట్రెస్ట్ లేకనే మొత్తానికి ప్రాజెక్ట్ నుంచి తప్పుకుందని చెప్పుకుంటున్నారు. అయితే, ఇండస్ట్రీలో మాత్రం హీరో అడివి శేష్‌తో తలెత్తిన క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్లే ఇగోకి పోయి.. సినిమా చేయనని మేకర్స్ కి నిర్మొహమాటంగా చెప్పినట్టు తెలుస్తోంది. అంతేకాదు, ఇప్పట్లో టాలీవుడ్ సినిమాలకి సైన్ చేసే ఆలోచన కూడా చేయడం లేదట. మరి ఇందులో ఎంతవరకూ నిజముందో తెలీదు గానీ, శ్రుతి నుంచి మాత్రం ఎలాంటి రియాక్షన్ లేదు.
Also Read – Pooja Hegde: బాహుబలి 3లో హీరోయిన్‌గా ఛాన్స్ ఇవ్వమని ప్రభాస్‌ను అడుగుతా – మనసులో మాట చెప్పేసింది


