Thalapathy Vijay Political Party: 2014లో జనసేన అనే పార్టీని స్థాపించిన సినీ హీరో పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి ప్రవేశించారు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి ప్రవేశించినప్పుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి ఎంతో దారుణంగా ఉంది. ఇక పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి ఇచ్చిన ఫస్ట్ స్పీచ్ ఎంతో మందిని విపరీతంగా ఆకట్టుకుంది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విడిపోయింది. అయినప్పటికీ పవన్ కళ్యాణ్ స్పీచ్ మాత్రం న్యూట్రల్ గా ఉంది.
అయితే పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టగానే పోటీకి దిగలేదు. ప్రశ్నించడం కోసమే పార్టీ పెట్టానంటూ 2019లో పోటీలోకి దిగారు. కాని, పవన్ కళ్యాణ్ నిలుచున్న రెండు చోట్లా ఓడిపోయారు. జనసేన పార్టీ కేవలం ఒక సీటుకు మాత్రమే పరిమితమైంది. అయినప్పటికీ పట్టు వదలని విక్రమార్కుడిలా పవన్ కళ్యాణ్ ఏ రోజు వెనకడుగు వేయలేదు. ఇంకా దూకుడును పెంచారు. అలా దాదాపు పదేళ్ళ కష్టానికి 2024లో 21 సీట్లలో పోటీ చేసి 21 సీట్లను గెలిచారు. ఇదంతా బాగానే ఉంది గానీ, పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వంతో కలవడం చాలా మందికి జీర్ణించుకోలేని విషయం.
Also Read – MEGA 158 Announcement: ఈసారి మరింత మాస్‌గా మెగాస్టార్.. బాబీ నెక్ట్స్ రేంజ్ ఎలివేషన్
పవన్ కళ్యాణ్ తెలుగు రాజకీయాల్లో ఎలా అయితే ఎంటరయ్యారో, తమిళ రాజకీయాల్లో హీరో విజయ్ కూడా అలాగే గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చారు. విజయ్ పార్టీ మీటింగ్ పెడితే మాత్రం భారీ సంఖ్యలో జనాలు హాజరవుతున్నారు. ముఖ్యంగా విజయ్ మీటింగ్స్ కి వచ్చిన జనాలను చూస్తే మైండ్ బ్లాకవ్వాల్సిందే. ఈరోజు కూడా మధురై లో మహానాడు సభను ఏర్పాటు చేయగా, ఈ సభలో విజయ్ మాట్లాడటం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. నేను సింగిల్ గానే పోటీ చేస్తున్నానని క్లారిటీ గా చెప్పారు.
సభలో విజయ్ మాట్లాడుతూ.. “అడవిలో రాజు ఒకడు మాత్రమే. అది సింగిల్ గా ఉన్నా కూడా జంగిల్ లో మాత్రం అదే కింగ్. ఇది నేను ఇస్తున్న డిస్క్రిప్షన్ కాదు. ఇది నా క్లియర్ డిక్లరేషన్”.. అన్నారు. అయితే, విజయ్ ఈ మాట అనడం వెనకున్న అసలు కారణం పవన్ కళ్యాణ్ నేనా.. అయనకే సెటైర్ వేశారా..? అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు.
అయితే, తాజాగా తమిళ రాజకీయాల్లో విజయ్ ఇచ్చిన స్పీచ్ ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సంచలనం అవుతోంది. విజయ్ సభలకు వస్తున్న జనం, అలాగే.. విజయ్ మాట్లాడే మాటలు.. చూస్తుంటే, గ్యారెంటీగా తమిళ రాజకీయాల్లో విజయకేతనం ఎగరవేస్తారనిపిస్తుంది. ఎన్నో అవరోధాలు దాటుకొని విజయ్ తమిళనాడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే మాత్రం హిస్టరీ క్రియేట్ చేసినట్టే. సినిమాల్లో తన సత్తా చాటుతున్న విజయ్ రాజకీయాల్లోనూ వ్యూహాత్మకంగా పావులు కదిపితే విజయం తథ్యం. చూడాలి మరి ఏం జరుగుతుందో.
Also Read – Andhra King Taluka: రిలీజ్ డేట్ వచ్చేసింది.


