హైదరాబాద్‌లోని సినీ ప్రముఖుల ఇళ్లు, కార్యాలయాల్లో మూడో రోజూ ఐటీ సోదాలు(IT Raids) కొనసాగుతున్నాయి. ప్రముఖ డైరెక్టర్ సుకుమార్(Sukumar) ఇంట్లోనూ వరుసగా రెండో రోజూ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. మరోవైపు నిర్మాత దిల్ రాజు ఇళ్లు, కార్యాలయాల్లోనూ విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. మైత్రీ మూవీస్, మ్యాంగో మీడియా, వృద్ధి సినిమాస్, ఇతర నిర్మాతల కార్యాలయాల్లోనూ సోదాలు కొనసాగుతున్నాయి.
కాగా గత రెండు రోజులుగా వీరికి చెందితన ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ బృందాలు తనిఖీలు చేపట్టిన సంగతి తెలిసిందే. అలాగే దిల్ రాజు భార్యను బ్యాంకుకు తీసుకెళ్లి లాకర్‌లు ఓపెన్ చేయించారు. నిర్మాణ సంస్థల ఆదాయం, పన్ను చెల్లింపు మధ్య తేడా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. పలు సంస్థలకు చెందిన వ్యాపార లావాదేవీల పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకు లాకర్లను కూడా తనిఖీ చేస్తున్నారు. మొత్తం 55 బృందాలు ఈ సోదాల్లో పాల్గొన్నాయి.