Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. కొంతవరకు టాకీ పార్ట్ చిత్రీకరణ అయ్యాక బ్రేక్ పడింది. చెప్పాలంటే ఈపాటికే మూవీ రిలీజ్ కూడా కావాల్సింది. ఎట్టకేలకి చాలా లాంగ్ గ్యాప్ తర్వాత మళ్లీ షూటింగ్ మొదలైంది. హరి హర వీరమల్లు, ఓజీ చిత్రాలను పూర్తి చేసిన పవన్ ఇప్పుడు ఉస్తాద్ మీదే దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కళ్యాణ్ పాల్గొనగా కొన్ని సీన్స్ కూడా కంప్లీట్ అయినట్టు తెలుస్తోంది.
సాంగ్స్ కోసం ఫారిన్ కూడా వెళ్ళబోతున్నారని ఈ మధ్య వార్తలు ప్రచారం అయ్యాయి. అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో పవన్ సరసన శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. దేవీ మ్యూజిక్ అంటే ఖచ్చితంగా మ్యూజికల్‌గా మంచి హిట్ అని ఫిక్సవచ్చు. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా.. మ్యూజిక్ పరంగా కూడా నెక్స్ట్ లెవెల్ అని టీజర్ చూస్తే అర్థమవుతోంది. గబ్బర్ సింగ్ సినిమాలో కెవ్వు కేక అనే సాంగ్ మాస్ ఆడియన్స్‌ని ఎంతగా ఉర్రూతలూగించిందో అందరికీ తెలిసిందే.
Also Read – Raghava Lawrence: తాగుబోతులకు సాయం చేయనన్న లారెన్స్.. చైల్డ్ ఆర్టిస్ట్ రవి రాథోడ్‌కి ఆర్థిక సాయం
ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ మూవీలోనూ అలాంటి కెవ్వు కేక ఒకటి ఉండబోతుందట. పవన్ కళ్యాణ్ ఈ సినిమాలోనూ పోలీస్ పాత్రలో నటిస్తున్నారు. దళపతి విజయ్ నటించిన తెరి సినిమా నుంచి ఉస్తాద్ కథను తీసుకున్నారు. ప్రముఖ దర్శక రచయిత దశరథ్ ఈ సినిమాకు పనిచేస్తుండటం కూడా మరో ప్లస్ పాయింట్. ఉస్తాద్ భగత్ సింగ్ యాక్షన్, డైలాగ్స్, పవన్ స్క్రీన్ ప్రెజెన్స్ ఇవన్నీ హై రేంజ్ లో ఉండబోతున్నాయి. ఇక దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ ప్రధాన బలంగా నిలవబోతుంది.
అంతేకాదు, పుష్ప1లో ఊ అంటావా మావ, పుష్ప 2 లో కిసీక్ సాంగ్స్ ని మించి ఉస్తాద్ మూవీలోని ఐటం సాంగ్ ఉంటుందని అద్భుతమైన మాస్ ట్యూన్ ని దేవీ ఇవ్వబోతున్నాడని యూనిట్ సభ్యులు చెప్పుకుంటున్నారు. కాగా, పవన్ కళ్యాణ్ నటించిన పాన్ ఇండియా సినిమా హరి హర వీరమల్లు ఈ నెల 24న పాన్ ఇండియా రేంజ్‌లో రిలీజ్ అవుతుంది. ఆ తర్వాత సుజిత్ దర్శకత్వంలో నటించిన ఓజీ సెప్టెంబర్ 25న రిలీజ్ కాబోతుంది. మొత్తానికి పవర్ స్టార్ ఫ్యాన్స్ ఈ ఏడాదిలో బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలతో డబుల్ ధమాకా అని చెప్పొచ్చు. ఇక ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా 2026 ప్రథమార్థంలో రానుందని తెలుస్తోంది.
Also Read – Vivo X200 FE: వివో X200 FE విడుదల..మీడియాటెక్ డైమెన్సిటీ 9300+ SoC, 6,500mAh బ్యాటరీ..


