Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభNTR: ఇది పూర్తిగా ‘వార్‌ 2’ టైమ్‌.. నిర్మాణ సంస్థ పోస్ట్

NTR: ఇది పూర్తిగా ‘వార్‌ 2’ టైమ్‌.. నిర్మాణ సంస్థ పోస్ట్

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్‌ (NTR) ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నాడు. మే 20న తాకర్ పుట్టినరోజు సందర్భంగా ఆయా సినిమాల అప్‌డేట్స్ కోసం అభిమానులు ఆసక్తి ఎదురుచూస్తున్నారు. ఇందులో భాగంగా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో బాలీవుడ్ అందగాడు హృతిక్ రోషన్‌తో కలిస ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న ‘వార్2′(War 2) మూవీ టీజర్ విడుదల కానుంది. ఈమేరకు మేకర్స్ ప్రకటించారు. దీంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. అయితే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తారక్ నటిస్తున్న చిత్రం నుంచి ఎలాంటి అప్‌డేట్ ఉండదని ఆ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ తాజాగా ప్రకటించడం అభిమానులను నిరుత్సాహపరుస్తోంది.

- Advertisement -

‘‘ఇది పూర్తిగా ‘వార్‌ 2’ టైమ్‌.. మేం ఈ సినిమాను గౌరవిస్తున్నాం. మన మారణహోమాన్ని ప్రారంభించే ముందు దీన్ని సెలబ్రేట్‌ చేసుకుందాం. మన మాస్‌ మిస్సైల్‌ను సరైన సమయంలో విడుదల చేద్దాం. ఈ పుట్టినరోజును ‘వార్ 2’తో చేసుకోండి’’ అంటూ అభిమానులకు సూచించింది. ఇక ‘వార్ 2’ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ నిర్మిస్తోంది. కియారా అడ్వాణీ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad