Thursday, June 19, 2025
Homeచిత్ర ప్రభBigg Boss season 9 Telugu: బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇస్తోన్న జ‌బ‌ర్ద‌స్త్ బ్యూటీ స‌త్య‌శ్రీ

Bigg Boss season 9 Telugu: బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇస్తోన్న జ‌బ‌ర్ద‌స్త్ బ్యూటీ స‌త్య‌శ్రీ

Satya Sri: నేష‌న‌ల్ వైడ్‌గా బిగ్‌బాస్ రియాలిటీ షోకు ఉన్న గుర్తింపే వేరు. నిర్వాహ‌కులు కూడా ప్ర‌తీ సీజ‌న్‌ను మంచి హైప్‌తోనే కండెక్ట్ చేస్తూ వ‌స్తున్నారు. అందువ‌ల్ల‌నే హాలీవుడ్ నుంచి బాలీవుడ్‌కి అక్క‌డి నుంచి మ‌న సౌత్‌కు కూడా ఈ షో వ‌చ్చేసింది. ఇక తెలుగు విష‌యానికి వ‌స్తే ఇక్కడి బుల్లితెరపై అతి పెద్ద రియాలిటీ షోగా పేరు తెచ్చుకున్న బిగ్ బాస్ మళ్లీ తన సందడిని ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే నాగార్జున హోస్ట్‌గా ఎనిమిది సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ షో, తొమ్మిదో సీజన్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది. తొలి సీజ‌న్‌కు యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, సెకండ్ సీజ‌న్‌కు నేచుర‌ల్ స్టార్ నాని హోస్ట్‌లుగా వ్య‌వ‌హ‌రించిన సంగ‌తి విదిత‌మే. ఎప్పుడైతే నాగార్జున ఎంట్రీ ఇచ్చాడో.. అప్ప‌టి నుంచి ఆయ‌నే హోస్ట్ చేస్తూ వ‌స్తున్నారు.

- Advertisement -

ప్ర‌తీ సీజ‌న్‌కు బిగ్ బాస్ హోస్ట్ మారుతాడంటూ వార్త‌లు వ‌స్తూనే ఉన్నాయి. బాలీవుడ్ స్టైల్లో టాలీవుడ్‌లోనూ ఓకే హోస్ట్ కంటిన్యూ అవుతున్నారు. ఇక బిగ్ బాస్ 9వ సీజ‌న్ గురించి మాట్లాడుకోవాలంటే.. రానున్న రోజుల్లో కొత్త హంగులతో, కొత్త కంటెస్టెంట్లతో షో మొదలవబోతోందనే వార్తలు సోషల్ మీడియాలో జోరుగా చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే ఈ సీజన్ కోసం కంటెస్టెంట్ల ఎంపిక ప్రక్రియ మొదలైపోయిందని ఇండ‌స్ట్రీలో వార్త‌లు వినిపిస్తున్నాయి. . టీవీ స్టార్స్, యూట్యూబ్ ఫేమ్‌లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు ఈసారి హౌస్‌లో అడుగుపెట్టనున్నారని అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో ఓ పాపులర్ కామెడీ ఆర్టిస్ట్ పేరు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఆమె మరెవరో కాదు, జబర్దస్త్ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన సత్యశ్రీ.

ALSO READ:https://teluguprabha.net/cinema-news/director-maruthi-reveals-story-of-prabhas-the-raja-saab/

చమ్మక్ చంద్రతో కలిసి చేసిన స్కిట్లతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సత్యశ్రీ, ఇటీవల నితిన్ నటించిన ఎక్స్‌ట్రార్డినరి మ్యాన్ వంటి సినిమాల్లో కూడా కనిపించింది. టీవీ షోలతో పాటు సినిమాల్లోనూ బిజీగా ఉన్న ఆమె, తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బిగ్ బాస్ గురించి స్పందించింది. ఆమె మాట్లాడుతూ “బిగ్ బాస్ నుండి ఆఫర్ వచ్చింది. కానీ అప్పట్లో ఇంటి విషయాలు వల్ల వెళ్లలేకపోయా. ఇప్పుడు అడిగితే తప్పకుండా వెళ్తాను. ఈ సీజన్ మాత్రం కుదరదు. ప్రస్తుతం కొన్ని సినిమా కమిట్మెంట్స్ ఉన్నాయ్. కానీ వచ్చే సీజన్ అయితే ఖచ్చితంగా వెళతాను” అని స్పష్టం చేసింది సత్యశ్రీ. ఇంతకంటే స్పష్టత ఏముంటుంది? బిగ్ బాస్ అభిమానులకు ఇది ఒక చిన్న నిరాశ అయితేనేం, వచ్చే సీజన్‌కి సత్యశ్రీ హౌస్‌లోకి అడుగుపెడతుందన్న ఆశ మాత్రం నల్లే మబ్బులో వెన్నెలలా కనిపిస్తోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News