Tuesday, September 17, 2024
Homeచిత్ర ప్రభJanhvi Kapoor : నేను సౌత్ అమ్మాయినే అంటున్న బాలీవుడ్ భామ.. తెలుగులో ఎప్పుడు ఛాన్స్...

Janhvi Kapoor : నేను సౌత్ అమ్మాయినే అంటున్న బాలీవుడ్ భామ.. తెలుగులో ఎప్పుడు ఛాన్స్ వస్తుందో మరి..

- Advertisement -

Janhvi Kapoor : శ్రీదేవి కూతురిగా జాన్వీ కపూర్ బాగానే ఫేమస్ అయింది. శ్రీదేవి కూతురు కావడంతో సౌత్ లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకుంది. ఎక్కువగా కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు చేసినా సోషల్ మీడియాలో మాత్రం తన బోల్డ్ ఫొటోలతో రచ్చ చేస్తూ ఫాలోవర్స్ ని పెంచుకుంటుంది. ఇక జాన్వీ ఎప్పుడు తెలుగు సినిమా చేస్తుందా అని ఎదురు చూస్తున్నారు టాలీవుడ్ ప్రేక్షకులు.

ఇప్పటికే చాలా సార్లు సౌత్ లో, ముఖ్యంగా టాలీవుడ్ లో సినిమా చేయాలనుకుంటున్నాను, ఆఫర్స్ వస్తే వదలను అని చెప్పింది జాన్వీ. తాజాగా శనివారం నాడు హైదరాబాద్ లో జరిగిన ఓ ఫ్యాషన్ షోకి జాన్వీ కపూర్ హాజరైంది. ఈ షో అనంతరం జాన్వీ మీడియాతో ఆసక్తిగా మాట్లాడింది.

జాన్వీ కపూర్ మాట్లాడుతూ.. ”నేను కూడా సౌత్ అమ్మాయినే. హైదరాబాద్ అంటే నాకు చాలా ఇష్టం. చిన్నప్పుడు అమ్మ, నాన్న సినిమాల షూటింగ్స్ హైదరాబాద్ లో జరిగిన ప్రతిసారి వచ్చాను. దాంతో హైదరాబాద్ అంటే ఇష్టం ఏర్పడింది. అలాగే తిరుపతికి కూడా చాలా సార్లు వచ్చాం. తిరుపతి అంటే చాలా ఇష్టం. అక్కడ దేవుడ్ని దర్శించుకుంటాను వచ్చిన ప్రతిసారి. సౌత్ తో నాకు ఎమోషనల్ కనెక్షన్ ఉంది. ఇక్కడ సినిమాలు చేయాలని అనుకుంటున్నాను, త్వరలోనే ఆ కోరిక తీరుతుంది అనుకుంటున్నాను” అని తెలిపింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News