Janhvi Kapoor : శ్రీదేవి కూతురిగా పరిచమైన జాన్వీ కపూర్ ఇప్పుడు బాలీవుడ్ బోల్డ్ బ్యూటీల్లో ఒకరిగా ఉంది. సినిమాల్లో మాత్రం వరుసగా కంటెంట్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులని మెప్పించడానికి ట్రై చేస్తుంది. కానీ సోషల్ మీడియాలో, బయట మాత్రం తన డ్రెస్సింగ్ స్టైల్ తో అందాలని అతిగా ఆరబోస్తుంది. సోషల్ మీడియాలో జాన్వీ పోస్ట్ చేసే బోల్డ్ ఫోటోలు ఎప్పుడూ ట్రెండింగ్ లోనే ఉంటాయి.
జాన్వీ స్టార్ కిడ్ కావడం, తన డ్రెస్సింగ్ స్టైల్ వల్ల, కేవలం కంటెంట్ సినిమాలు మాత్రమే చేస్తున్నందుకు తనపై ట్రోల్స్ కూడా బాగానే వస్తాయి. ఇప్పటికే చాలా సార్లు తనపై వచ్చిన ట్రోల్స్ ని పట్టించుకోని అని చెప్పింది జాన్వీ. తాజాగా ఓ ఇంటర్వ్యూలో జాన్వీపై వచ్చే ట్రోల్స్ గురించి స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
జాన్వీ కపూర్ మాట్లాడుతూ.. ”బాలీవుడ్ బిగ్ ప్రొడక్షన్ హౌజ్ ధర్మ ప్రొడక్షన్స్ నన్ను లాంచ్ చేశారు. కరణ్ జోహార్ నన్ను హీరోయిన్ గా లాంచ్ చేశారు. బహుశా అదే నాపై ట్రోలింగ్ కి కారణమవ్వచ్చు. కరణ్ జోహార్ నన్ను లాంచ్ చేసినందుకే నన్ను ద్వేషిస్తున్నారు అనుకుంట. అతనిపై ఉన్న నెగిటివిటీని నా మీద కూడా చూపిస్తున్నారు కావొచ్చు. కానీ ఇలా ద్వేషించేవాళ్ళకి, ట్రోల్ చేసేవారికి కరణ్ జోహార్ గురించి తెలిసి ఉండకపోవచ్చు. అలాంటి బ్యానర్ లో నా మొదటి సినిమా చేయడం నా అదృష్టం. కరణ్ నాకు ఎప్పుడూ సపోర్ట్ ఉంటాడు” అని తెలిపింది. మరి దీనిపై కరణ్ ఏమైనా స్పందిస్తాడేమో చూడాలి.