Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభJanhvi Kapoor : ‘అందుకే అతడిని నా భర్త అన్నాను’ - జాన్వీ కపూర్

Janhvi Kapoor : ‘అందుకే అతడిని నా భర్త అన్నాను’ – జాన్వీ కపూర్

Janhvi Kapoor : బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ తాజాగా విడుదలైన ‘పరమ్ సుందరి’ సినిమా ప్రమోషన్‌లో భాగంగా సరదాగా ఓ విషయం పంచుకున్నారు. ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్ పోర్టల్ IMDb నిర్వహించిన ‘స్పీడ్ డేటింగ్’ ఇంటర్వ్యూలో జాన్వీ తన ఫన్నీ అనుభవాలను వెల్లడించారు. విదేశాల్లో యువకులు తన వెంటపడకుండా ఉండేందుకు తనకు పెళ్లి అయినట్లు చెబుతానని సరదాగా చెప్పారు.

- Advertisement -

ALSO READ: Sugali Preethi : సుగాలి ప్రీతి కేసు.. పవన్ కల్యాణ్‌పై ఆరోపణలకు జనసేన గట్టి కౌంటర్

‘‘నేను చాలాసార్లు నాకు వివాహం అయిందని చెప్పాను. విదేశాల్లో రిసార్ట్స్, హోటల్స్‌లో కొందరు యువకులు చనువుగా ఉండడానికి ప్రయత్నించేవారు. ఒకసారి లాస్ ఏంజిల్స్‌లో హోటల్ సిబ్బందికి ఓర్రీ నా భర్త అని చెప్పాను’’ అని జాన్వీ నవ్వుతూ వెల్లడించారు. ఓర్రీ బాలీవుడ్‌లో ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా గుర్తింపు పొందారు. ఆయన బాలీవుడ్ స్టార్స్‌తో సన్నిహిత స్నేహితుడిగా ఉంటారు.

అలాగే, ఒకసారి ఓ వ్యక్తి తనను కలవడానికి లండన్ నుంచి ముంబయికి వచ్చినట్లు కల వచ్చిందని, ఉలిక్కిపడి నిద్రలేచానని జాన్వీ సరదాగా చెప్పారు. ప్రేమ గురించి మాట్లాడుతూ, ప్రేమ అంటే కేవలం రొమాన్స్ మాత్రమే కాదని, ఇద్దరు వ్యక్తుల మధ్య పరస్పర అవగాహన, కష్టసుఖాల్లో తోడుగా నిలవడమే నిజమైన ప్రేమ అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. జాన్వీ సరదా స్వభావం, ఆమె చెప్పిన ఈ ఫన్నీ అనుభవాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ‘పరమ్ సుందరి’ సినిమాతో జాన్వీ మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad