Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభJanhvi kapoor: అల్లు అర్జున్ మూవీ కోసం రెమ్యూన‌రేష‌న్ పెంచేసిన జాన్వీ - అంత డిమాండ్...

Janhvi kapoor: అల్లు అర్జున్ మూవీ కోసం రెమ్యూన‌రేష‌న్ పెంచేసిన జాన్వీ – అంత డిమాండ్ చేసిందా?

Janhvi kapoor: జూనియ‌ర్ ఎన్టీఆర్ హీరోగా న‌టించిన దేవ‌ర మూవీతో హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది జాన్వీక‌పూర్‌. తొలి సినిమాలో జాన్వీ గ్లామ‌ర్‌తో పాటు యాక్టింగ్‌కు మంచి మార్కులే ప‌డ్డాయి. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో యాక్ష‌న్ డ్రామాగా రూపొందిన ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద ఐదు వందల కోట్ల‌కుపైగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. దేవ‌ర బ్లాక్‌బ‌స్ట‌ర్‌తో టాలీవుడ్‌లో ల‌క్కీస్టార్‌గా మారిపోయింది జాన్వీ. స్టార్ హీరోల సినిమాల నుంచి వ‌రుస‌గా ఆఫ‌ర్లు అందుకుంటోంది.

- Advertisement -

రెమ్యూన‌రేష‌న్ పెంచేసింది…
దేవ‌ర సినిమాతో టాలీవుడ్‌లో త‌న‌కు ఏర్ప‌డిన క్రేజ్‌ను క్యాష్ చేసుకునే ప్ర‌య‌త్నాల్లో ప‌డింద‌ట జాన్వీక‌పూర్‌. అప్‌క‌మింగ్ మూవీస్ కోసం రెమ్యూన‌రేష‌న్ పెంచిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతుంది. ప్ర‌స్తుతం పెద్ది మూవీలో రామ్‌చ‌ర‌ణ్‌కు జోడీగా న‌టిస్తోంది. అల్లు అర్జున్, అట్లీ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న‌ సినిమాలో ఓ హీరోయిన్ జాన్వీక‌పూర్ సెలెక్ట్ అయిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతుంది. దేవ‌ర సినిమా కోసం ఐదు కోట్ల వ‌ర‌కు రెమ్యూన‌రేష‌న్ తీసుకున్న జాన్వీక‌పూర్… పెద్ది, అల్లు అర్జున్ మూవీస్ కోసం మ‌రో రెండు కోట్లు ఎక్కువే డిమాండ్ చేసిన‌ట్లు చెబుతున్నారు. ఈ సినిమాల కోసం ఏడు కోట్ల వ‌ర‌కు రెమ్యూన‌రేష‌న్‌ను అందుకున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతుంది.

Also Read – Russian Plane Crash:రష్యాలో కూలిన విమానం..50 మంది దుర్మరణం..!

ఒక్క హిట్టుతోనే…
టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లో జాన్వీకి మంచి ఫాలోయింగ్ ఉండ‌టంతో మేక‌ర్స్ ఆమె కోరినంత మొత్తాన్ని ఇచ్చిన‌ట్లు చెబుతున్నారు. ఒక్క హిట్టుతోనే జాన్వీ రెమ్యూన‌రేష‌న్‌ను పెంచ‌డం టాలీవుడ్ వ‌ర్గాల్లో ఆస‌క్తిక‌రంగా మారింది. జాన్వీ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ రెండు సినిమాలు వ‌చ్చే ఏడాది ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాయి.

రా అండ‌ర్ ర‌స్టిక్‌..
స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో యాక్ష‌న్ డ్రామాగా తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఈ సినిమాలో రా అండ్ ర‌స్టిక్ రోల్‌లో రామ్‌చ‌ర‌ణ్ క‌నిపించ‌బోతున్నాడు. జాన్వీ క‌పూర్ కూడా డీ గ్లామ‌ర్ లుక్‌లో న‌టిస్తున్న‌ట్లు స‌మాచారం. మైత్రీ మూవీ మేక‌ర్స్‌, సుకుమార్ రైటింగ్స్ నిర్మిస్తున్న ఈ సినిమా రామ్‌చ‌ర‌ణ్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా 2026 మే 27న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాకు ఏఆర్ రెహ‌మాన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

Also Read – Chandrababu: హరిహర వీరమల్లు సినిమాపై స్పందించిన సీఎం చంద్రబాబు

న‌లుగురు హీరోయిన్లు…
మ‌రోవైపు అల్లు అర్జున్, అట్లీ మూవీ ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో ఉంది. దాదాపు 800 కోట్ల బ‌డ్జెట్‌తో సైంటిఫిక్ రొమాంటిక్ యాక్ష‌న్ మూవీగా రూపొందుతున్న ఈ సినిమాలో జాన్వీక‌పూర్‌తో పాటు దీపికా ప‌దుకోణ్, మృణాల్ ఠాకూర్, ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్లుగా న‌టించ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. న‌లుగురు నాయిక‌ల్లో దీపికా ప‌దుకోణ్ పేరును మాత్ర‌మే మేక‌ర్స్ అఫీషియ‌ల్‌గా రివీల్ చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad