Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభHomebound Oscar Entry: లక్‌ అంటే జాన్వీదే.. రిలీజ్‌కు ముందే ఆస్కార్‌ అవార్డుకు ఎంట్రీ 

Homebound Oscar Entry: లక్‌ అంటే జాన్వీదే.. రిలీజ్‌కు ముందే ఆస్కార్‌ అవార్డుకు ఎంట్రీ 

Janhvi Kapoor Homebound Oscar Entry: లక్‌ అంటే జాన్వీ కపూర్‌దే.. రిలీజ్‌కు ముందే జాన్వీ నటించిన ‘హోమ్‌బౌండ్‌’ మూవీ ‘ఆస్కార్‌-2026’ అవార్డులకు ఎంట్రీ దక్కించుకుంది. ఆస్కార్‌ అవార్డుల ఎంట్రీకి భారతీయ చిత్ర పరిశ్రమ నుంచి పోటీ పడ్డ 24 సినిమాల్లో ‘హోమ్‌బౌండ్‌’ కూడా ఒకటి. అయితే రిలీజ్‌కు ముందే ఆస్కార్‌కు నామినేట్‌ కావడంతో సినీ పరిశ్రమ నుంచి మూవీ టీమ్‌కు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

- Advertisement -

ఇషాన్‌ కట్టర్‌, విశాల్‌ జెత్వా, జాన్వీ కపూర్‌ కీలక పాత్రల్లో నటించిన సినిమా ‘హోమ్‌బౌండ్‌'(Homebound) సెప్టెంబర్‌ 26న థియేటర్లలో విడుదల కానుంది. అయితే రిలీజ్‌కు ముందే ‘ది బెస్ట్‌ ఇంటర్నేషనల్‌ ఫీచర్‌’ విభాగంలో భారత్‌ తరఫున ఆస్కార్‌కు ఈ సినిమా ఎంట్రీ పొందింది. ఈ మేరకు సెలెక్షన్‌ కమిటీ ఛైర్‌ పర్సన్‌ ఎన్‌. చంద్ర వివరాలు తెలిపారు. 

Also Read: https://teluguprabha.net/cinema-news/jr-ntr-injured-in-private-ad-shoot/

నీరజ్‌ గేవాన్‌ దర్శకత్వం వహించిన ‘హోమ్‌బౌండ్‌’ ఇప్పటికే అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటింది. ఈ ఏడాది మేలో జరిగిన 78వ కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ఈ సినిమా ప్రదర్శించిన అనంతరం అతిథులంతా నిల్చొని చాలా సేపు చప్పట్లు కొట్టారు. ఈ ఎమోషనల్‌ మూవీ సినీ పెద్దలను ఎంతగా కదిలించిందో ఈ సంఘటన ద్వారా అర్థం చేసుకోవచ్చు. ఇక టొరంటో ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో రెండో రన్నరప్‌గా ‘ఇంటర్నేషనల్‌ పీపుల్స్‌ ఛాయిస్‌’ అవార్డును సైతం గెలుచుకుంది. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad