Janhvi Kapoor: బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ ఇప్పుడు తెలుగు సినిమాలలో ఎక్కువగా కనిపిస్తోంది. ఆమె ఎంచుకుంటున్న కథలు ప్రధానంగా పల్లెటూరి కథలు. అయితే, ప్రస్తుతం బాలీవుడ్‌లో కూడా జాన్వీకి పెద్దగా హిట్లు లేవు. రీసెంట్ గా ఆమె సినిమాలు ఆశించినంత విజయాన్ని సాధించలేదు. ఇలాంటి సమయంలో, తెలుగులో ఆమె చేస్తున్న పాత్రల లుక్స్, యాస విషయంలో ఒకే తరహా పోలికలు ఉండడంపై ఆందోళన పెరుగుతోంది.
ALSO READ: DC: లోకేష్ కనగరాజ్ హీరోగా ఎంట్రీ, ‘DC’ సినిమాపై భారీ అంచనాలు!
పేరు పల్లెటూరు, బట్టలు మాత్రం మోడ్రన్!
జాన్వీ కపూర్ మొదటి తెలుగు సినిమా ‘దేవర’లో తన పాత్ర పేరు ‘తంగం’. ఆ తర్వాత రామ్ చరణ్‌తో చేస్తున్న ‘పెద్ది’లో ‘అచ్చియమ్మ’ పాత్రలో కనిపించబోతుంది. ఇక్కడ సమస్య ఏమిటంటే, పాత్రలకు ‘తంగం’, ‘అచ్చియమ్మ’ లాంటి పూర్తిగా పల్లెటూరి పేర్లు పెడుతున్నారు. కానీ, వారు వేసుకునే బట్టలు, మేకప్ మాత్రం చాలా మోడ్రన్‌గా కనిపిస్తున్నాయి. దీనివల్ల పేరుకు, లుక్‌కు అస్సలు పొంతన ఉండడం లేదు అనే విమర్శ గట్టిగా వినిపిస్తోంది.
ALSO READ: Prashanth Varma: ఒక ప్రశాంత్ వర్మ.. 100 కోట్ల అడ్వాన్సుల కథ!
‘పెద్ది’లో అదే రిపీట్ ఐతే… కెరీర్‌కు కష్టమే!
ముఖ్యంగా, పల్లెటూరి కథలలో ఆ పాత్రలు మాట్లాడే యాస చాలా ముఖ్యం. పేరు పల్లెటూరిది, బట్టలు మోడ్రన్, యాస కూడా సరిగా లేకపోతే ఆ పాత్రలు ప్రేక్షకులకు కనెక్ట్ కావడం కష్టం. బాలీవుడ్‌లో హిట్లు లేని సమయంలో, తెలుగులో ఆమె నటించిన ‘దేవర’ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోలేదు, దేవర లో జాన్వీ యాస మీద కూడా చాల ట్రోలింగ్ జరిగింది. ఇప్పుడు ‘పెద్ది’లో కూడా ఇదే రిపీట్ ఐతే, తెలుగులో జాన్వీ కపూర్ కెరీర్‌కు పెద్ద బ్రేక్ పడినట్టే.


