Janhvi Kapoor: ఒకప్పుడు హీరోహీరోయిన్లు కోటి రెమ్యూనరేషన్ తీసుకుంటేనే గొప్పగా చెప్పుకునేవాళ్లు. కానీ ఇప్పుడు వందల కోట్లు కామన్‌గా మారిపోయింది. అల్లు అర్జున్, ప్రభాస్ వంటి స్టార్ హీరోలు ఒక్కో సినిమా కోసం వంద కోట్లకుపైనే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. సినిమా నిర్మాణానికి అయ్యే వ్యయం కంటే రెమ్యూనరేషన్లకే నిర్మాతలు ఎక్కువగా బడ్జెట్ కేటాయించాల్సి వస్తుందనే వాదనలు చాలా కాలంగా టాలీవుడ్‌లో వినిపిస్తున్నాయి. స్టార్ హీరోహీరోయిన్లతో సినిమా అంటేనే రిస్క్ అనే ప్రచారం జరుగుతోంది.
ముఖ్యంగా అగ్ర నాయికల విషయంలో రెమ్యూనరేషన్లతో పాటు అదనపు ఖర్చులు బోలెడు ఉంటాయి. ఒక్కో హీరోయిన్‌కు సపోర్టింగ్ స్టాఫ్ ఐదారుగురి వరకు ఉంటారు. వారందరి ఖర్చు ప్రొడ్యూసర్లు భరించాల్సివుంటుందనే విమర్శలు ఉన్నాయి. టాప్ హీరోయిన్లకు ఉన్న క్రేజ్ కారణంగా కష్టమైనా ప్రొడ్యూసర్లు అవన్నీ భరిస్తుంటారని టాక్ ఉంది.
ఇబ్బంది పెట్టదు…
కానీ జాన్వీకపూర్ మాత్రం ప్రొడ్యూసర్లను ఇబ్బంది పెట్టే టైప్ కాదట. ఈ విషయాన్ని స్వయంగా ఆమె తండ్రి బోనీ కపూర్ వెల్లడించాడు. ప్రస్తుతం జాన్వీకపూర్ ఒక్కో సినిమాకు ఏడు కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటుందనే ప్రచారం జరుగుతోంది. ఈ రూమర్స్‌పై బోనీ కపూర్ రియాక్ట్ అయ్యారు. ‘‘నిర్మాతల కష్టనష్టాలు ఎలా ఉంటాయో జాన్వీ ప్రత్యక్షంగా చూసింది. అందుకే ప్రొడ్యూసర్లను ఇబ్బంది పెట్టాలని ఎప్పుడూ అనుకోదు. అగ్రిమెంట్ చేసుకున్న రెమ్యూనరేషన్‌కు మించి ఒక్క రూపాయి కూడా ఎక్స్‌ట్రా తీసుకోదు. తనకు చేతనైనంతలో ఖర్చు తగ్గించాలనే చూస్తుంది. షూటింగ్‌ల కోసం ట్రావెలింగ్ చేయాల్సివచ్చినప్పుడు సొంత డబ్బులు పెట్టి టికెట్ కొనుక్కొంటుంది. ఈ జర్నీలలో తనతో పాటు టీమ్ మెంబర్స్, రిలేటివ్స్ ఎవరైనా వెంట ఉంటే వారి ఖర్చులు తానే భరిస్తుంది తప్పితే ప్రొడ్యూసర్లపై రుద్దాలని ఎప్పుడూ అనుకోదు’’ అని బోనీ కపూర్ అన్నారు. తల్లి శ్రీదేవి నుంచే జాన్వీకి ఈ గుణాలన్నీ వచ్చాయని బోనీ కపూర్ అన్నాడు.
దేవరతో ఎంట్రీ…
దేవర మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది జాన్వీకపూర్. ఎన్టీఆర్ హీరోగా నటించిన ఈ మూవీతో తొలి అడుగులోనే పెద్ద హిట్ అందుకుంది. యాక్టింగ్ పరంగా అంతగా పేరు రాకపోయినా గ్లామర్‌తో మెప్పించింది. దేవర తర్వాత రామ్‌చరణ్‌తో పెద్ది సినిమా చేస్తుంది. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో స్పోర్ట్స్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ మూవీ వచ్చే ఏడాది మార్చి 27న రిలీజ్ కాబోతుంది. మరోవైపు జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించిన హిందీ మూవీ పరమ్ సుందరి ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చింది. రొమాంటిక్ లవ్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది.
Also Read- Simrat Kaur: సొగసులతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న సిమ్రత్ కౌర్


