Janhvi Kapoor: గత కొన్నాళ్లుగా జాన్వీకపూర్‌ను వరుసగా వివాదాలు వెంటాడుతున్నాయి. ఇటీవల రిలీజైన పరమ్‌సుందరి ట్రైలర్‌లో సిద్ధార్థ్ మల్హోత్రా, జాన్వీకపూర్ రొమాంటిక్ సీన్లపై నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మూవీలో మలయాళీ అమ్మాయిగా జాన్వీ కనిపించిన తీరుపై చాలా విమర్శలు వచ్చాయి. తాజాగా జాన్వీ కపూర్ మరో వివాదంలో చిక్కుకుంది.
కృష్ణాష్టమి వేడుకల్లో…
ఇటీవల ముంబాయిలో జరిగిన కృష్ణాష్టమి వేడుకల్లో జాన్వీకపూర్ పాల్గొన్నది. ఈ వేడుకల్లో ఉట్టి కొట్టే సమయంలో భారత్ మాతాకీ జై అంటూ జాన్వీకపూర్ అనడంపై నెటిజన్లు విమర్శలను గుప్పిస్తున్నారు. జాన్వీకపూర్ మొదట ఇండిపెండెన్స్‌డేకు, కృష్ణాష్టమికి తేడా తెలుసుకుంటే మంచిదంటూ ట్రోల్ చేశారు. ఈ వేడుకలో ఏం మాట్లాడాలో కూడా జాన్వీకపూర్‌కు తెలియదని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. వరుసగా రెండు వేడుకలు ఒకే వీక్‌లో రావడంలో జాన్వీకపూర్ కన్ఫ్యూజ్ అయ్యిందని చాలా మంది నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ చేశారు.
ప్రతి రోజు అంటాను…
ఈ ట్రోల్స్‌పై జాన్వీకపూర్ సీరియస్‌గా రియాక్ట్ అయ్యింది. ఈ మేరకు ఇన్‌స్టాగ్రమ్‌లో ఓ పోస్ట్ పెట్టింది. కృష్ణాష్టమి నాడే కాకుండా ప్రతిరోజు తాను భారత్ మాతాకీ జై అంటానని, దేశాన్ని ప్రత్యేకంగా ఓ రోజు మాత్రమే పొగడాలనే రూలేం లేదని అన్నది. పూర్తి వీడియో చూడకుండానే చాలా మంది తనను ట్రోల్ చేస్తున్నారు. తనకంటే ముందు కృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొన్నవారు భారత్ మాతాకీ జై అని అన్నారు. వారు అన్న తర్వాతే తాను నేను భారత్ మాతా కీ జై అని అన్నాను. వారి మాటలను వదిలిపెట్టి నన్ను మాత్రమే విమర్శించడం సరికాదంటూ ఇన్‌స్టాగ్రమ్ పోస్ట్‌లో పేర్కొన్నది.
చర్చిలో రొమాన్స్…
కాగా జాన్వీకపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న పరమ్ సుందరి మూవీ ఈ నెలాఖరున రిలీజ్ అవుతోంది. ఇటీవల మేకర్స్ ఈ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్‌లో సిద్ధార్థ్ మల్హోత్రా, జాన్వీకపూర్‌లపై చర్చిలో రొమాంటిక్ సీన్లు ఉన్నాయి. ఈ సీన్లపై అభ్యంతరం వ్యక్తం చేసిన నెటిజన్లు సినిమా మేకర్స్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు పరమ్ సుందరి మూవీలో జాన్వీకపూర్ రోల్ మలయాళీ అమ్మాయిలను కించపరిచే విధంగా ఉందంటూ సింగర్ పవీత్ర మీనన్ కూడా తీవ్ర ఆరోపణలు చేసింది.
కాగా జాన్వీకపూర్ ఎన్టీఆర్ దేవరతో హీరోయిన్‌గా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ పెద్దిలో హీరోయిన్‌గా నటిస్తోంది.
Also Read – Rahul Sipligunj: సైలెంట్ గా ప్రేయసి తో పెళ్లి పీటలు ఎక్కుతున్న రాహుల్ సిప్లిగంజ్


