Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభJanhvi Kapoor : ఆ హీరోకి ఫోన్ చేసి సౌత్ లో ఛాన్స్ ఇవ్వమని అడుక్కున్నా..

Janhvi Kapoor : ఆ హీరోకి ఫోన్ చేసి సౌత్ లో ఛాన్స్ ఇవ్వమని అడుక్కున్నా..

- Advertisement -

Janhvi Kapoor : బాలీవుడ్ భామ, శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ బాలీవుడ్ లో వరుసగా కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు, లేడీ ఓరియెంటెడ్ సినిమాలే చేస్తుంది. కమర్షియల్ సినిమాలకి ఛాన్సులొస్తున్నా పెద్దగా పట్టించుకోవట్లేదు. ఇక జాన్వీ ఎప్పుడు సౌత్ లో నటిస్తుందో అని సౌత్ సినీ ప్రేక్షకులు, అభిమానులు ఎదురు చూస్తున్నారు.

సౌత్ లో జాన్వీకి అభిమానులు కూడా ఎక్కువే. ఆమెని సౌత్ లో లాంచ్ చేయాలనుకున్నా కుదరట్లేదు ఎందుకో. జాన్వీ కూడా ఇప్పటికే పలు ఇంటర్వ్యూలలో టాలీవుడ్ లో, సౌత్ లో చేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్టు తెలిపింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సౌత్ లో సినిమా గురించి ఆసక్తికర విషయాన్ని తెలిపింది.

జాన్వీ కపూర్ మాట్లాడుతూ.. గతంలోనే సౌత్ సినిమాల్లో చేయాలని అనుకున్నాను. తమిళ్ లో విజయ్ సేతుపతి సర్ యాక్టింగ్ అంటే నాకు చాలా ఇష్టం. అయన చేసిన నేనూ రౌడీనే సినిమా చాలా సార్లు చూశాను. ఆ సినిమా చూసి ఆయనకి అభిమానిగా మారిపోయాను. ఆయనతో కలిసి నటించాలని ఉంది. ఒకసారి విజయ్ సేతుపతి సర్ కి ఫోన్ చేసి మాట్లాడాను. ఎలాగైనా మీ సినిమాలో ఛాన్స్ ఇవ్వమని అడిగాను. ఆయనకి పెద్ద అభిమాని అని చెప్పాను, కావాలంటే ఆడిషన్ కూడా ఇస్తాను అన్నాను. ఆయన నవ్వి వదిలేశారు. సమాధానం మాత్రం చెప్పలేదు. ఆయన సౌత్ లో ఛాన్స్ ఇస్తారేమో అని చూస్తున్నాను” అంటూ తెలిపింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad