Sunday, October 6, 2024
Homeచిత్ర ప్రభJanhvi: ఎన్టీఆర్, జాన్వీ కొరటాల డైరెక్షన్ లో..

Janhvi: ఎన్టీఆర్, జాన్వీ కొరటాల డైరెక్షన్ లో..

ఎట్టకేలకు శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ టాలీవుడ్ లో అడుగు పెడుతున్నారు. అదికూడా ఇంతకాలం సాగిన ప్రచారం నిజం చేస్తూ తారక్ తో ఆన్ స్క్రీన్ చేసేందుకు జాన్వి రెడీ అయ్యారు. కొరటాల శివ దర్శకత్వంలో ఈ బాలీవుడ్ కుర్ర హీరోయిన్ తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. ఎప్పటినుంచో జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి తెలుగు ఇండస్ట్రీకి జాన్వి కపూర్ పరిచయం అవుతారని రూమర్లు వస్తున్నాయి. కాగా బాలీవుడ్ లో ఈమెకు ఇప్పటి వరకూ ఒక్కహిట్ లేకపోయినా కేవలం సూపర్ స్టార్ శ్రీదేవి కూతురుగా వరుసపెట్టి సినిమాలు, వెబ్ సిరీస్ లు చేసుకుపోతున్నారు. నెపో కిడ్ గా పేరుగాంచిన జాన్వికి తెలుగులోనైనా మంచి కమర్షియల్ హిట్ దక్కుతుందేమో చూడాలి. విజయ్ దేవరకొండ, తారక్ ను అమితంగా ఇష్టపడే జాన్వి ఎప్పటినుంచో తెలుగులో యాక్ట్ చేయాలని ఉవ్విళ్లూరుతున్నారు.

- Advertisement -

శ్రీదేవి, ఎన్టీఆర్ ఇద్దరూ కలిసి ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించగా, ఇప్పుడు తాజాగా ఎన్టీఆర్ మనువడు జూనియర్ ఎన్టీఆర్, శ్రీదేవి కుమార్తె జాన్వి కపూర్ కలిసి నటిస్తుండటంతో ఇది పెద్ద హిట్ కొట్టడం ఖాయమనే అంచనాలు భారీగా ఉన్నాయి. ఎన్టీఆర్ 30 సినిమా ఈ నెలలోనే షూటింగ్ మొదలుపెట్టనుంది.

ఇక మిలి, రూహి, గుంజన్ సక్సేనా, గోస్ట్ స్టోరీస్, గుడ్ లక్ జెర్రీ వంటి సినిమాలు, వెబ్ సిరీస్ ల్లో యాక్ట్ చేశారు. దోస్తానా-2, బవాల్, మిస్టర్ అండ్ మిస్ట్రస్ మహి వంటి సినిమాల షూటింగ్స్ లో ఉండగా తొలి సినిమా ధడక్ తో ఆమె బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News