Monday, November 17, 2025
Homeచిత్ర ప్రభJani Master: త్వరలోనే మీ నిజ స్వరూపం బయటపడుతుంది: జానీ మాస్టర్‌

Jani Master: త్వరలోనే మీ నిజ స్వరూపం బయటపడుతుంది: జానీ మాస్టర్‌

తనపై తప్పుడు ప్రచారాలు చేసేవారిని చూస్తుంటే జాలి వేస్తుందని ప్రముఖ డ్యాన్స్‌ కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌(Jani Master) తెలిపారు. నిజానిజాలు త్వరలోనే బహిర్గతం అవుతాయని ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ పెట్టారు.

- Advertisement -

‘‘తమ సొంత లాభం కోసం కోర్టు ఆర్డర్లపైన కూడా తప్పుడు ప్రచారాలు చేసేవారిని చూస్తుంటే జాలేస్తుంది. ముందస్తుగా నాకు తెలియకుండా జరిగిన యూనియన్‌ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ గురించి పెట్టిన కేసుకి సంబంధించి వచ్చిన తీర్పుని మీకు అనుకూలంగా, నచ్చినట్టుగా మార్చి మరో కేసుతో ముడిపెట్టి పోస్టులు పెడుతున్నారు. మీరేది చెప్పినా ప్రజలు నమ్ముతారనుకుంటున్నారేమో కానీ, అసలు తీర్పు వివరాలు బయటకి వచ్చిన రోజున మీ నిజ స్వరూపమేంటో, దేనికోసం ఈ దుష్ప్రచారం చేస్తున్నారనేది అందరికీ అర్థమవుతుంది. ఆ రోజు ఎంతో దూరంలో లేదు. న్యాయమే గెలుస్తుంది, నిజం అందరికీ తెలుస్తుంది’’ అని పేర్కొన్నారు.

కాగా తనను డాన్సర్ అసోసియేషన్ అధ్యక్ష పదవి నుంచి తప్పించాలన్న ఫిల్మ్ ఛాంబర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ జానీ మాస్టర్ కోర్టుకెక్కారు. ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను తాజాగా కోర్టు కొట్టివేసిందని ప్రముఖ యాంకర్, నటి ఝాన్సీ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. దీంతో ఆమెకు కౌంటర్‌గా జానీ ఈ పోస్ట్ పెట్టినట్లు అర్థమవుతోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad