Monday, March 31, 2025
Homeచిత్ర ప్రభNTR: తెలుగులో మాట్లాడిన జపాన్ మహిళ.. ఎన్టీఆర్ ట్వీట్ వైరల్

NTR: తెలుగులో మాట్లాడిన జపాన్ మహిళ.. ఎన్టీఆర్ ట్వీట్ వైరల్

స్టార్ హీరో ఎన్టీఆర్‌(NTR)కు ఇండియాతో పాటు జపాన్‌లోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయన సినిమాలకు అక్కడ సూపర్ క్రేజ్ ఉంది. అంతేకాకుండా తారక్‌ను చూడటానికి జపనీయులు హైదరాబాద్ వస్తూ ఉంటారు. అలాగే ఎన్టీఆర్ కూడా జపాన్ పర్యటిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ హీరోగా న‌టించిన ‘దేవ‌ర'(Devara) సినిమాను ఈ నెల 28న జ‌పాన్‌లో విడుద‌ల చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో తార‌క్, ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ జపాన్‌లో ప్రమోష‌న్స్ నిర్వ‌హిస్తున్నారు. ఈ క్ర‌మంలో జ‌పాన్ ప‌ర్య‌ట‌న‌పై ఆస‌క్తిక‌ర ట్వీట్ చేశారు.

- Advertisement -

“నేను జపాన్ ను సందర్శించిన ప్ర‌తిసారి నాకు ఎప్పుడూ అందమైన జ్ఞాపకాలు ల‌భిస్తాయి. కానీ, ఈసారి సందర్శన కాస్త భిన్నంగా ఉంది. ఒక జపనీస్ మహిళ అభిమాని ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చూసిన తర్వాత తెలుగు నేర్చుకున్నానని చెప్పడం నిజంగా నన్ను కదిలించింది. ఓవిధంగా ఎంతో సంతోషాన్నిచ్చింది. సంస్కృతుల మ‌ధ్య వార‌ధిగా ఉన్న సినిమా… భాష‌ను నేర్చుకునేలా చేయ‌డాన్ని సినిమా మరియు భాషా ప్రేమికుడిగా నేను ఎప్పటికీ మర్చిపోలేని విషయం” అని తార‌క్ తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News