Jaradhara: టాలీవుడ్ హ్యాండ్సమ్ హంక్ సుధీర్ బాబు, బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా కీలక పాత్రల్లో నటిస్తున్న ప్రతిష్టాత్మక పాన్-ఇండియా చిత్రం ‘జటాధర’
ఇది ఒక సూపర్ నేచురల్ మైథలాజికల్ థ్రిల్లర్. ముఖ్యంగా, కేరళలోని అనంత పద్మనాభ స్వామి ఆలయం నేపథ్యం చుట్టూ కథ అల్లినట్లు తెలుస్తోంది,
ALSO READ: https://teluguprabha.net/cinema-news/siddu-jonnalagadda-womanizer-question-journalism-values/
బాలీవుడ్ స్టార్ సోనాక్షి సిన్హా ఒక శక్తివంతమైన, కీలకమైన పాత్రను పోషిస్తోంది ఆమె ‘ధనపిశాచి’ వంటి పాత్రలో కనిపించబోతునట్టుగా ఈ మూవీ టీజర్ చూస్తేనే తెలుస్తోంది. ఈ మూవీ ని వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ ఇద్దరు డైరెక్టర్ లు ఈ మూవీ ని డైరెక్ట్ చేయడం విశేషం. జటాధర మూవీ 2025 నవంబర్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు.ఈ సూపర్ నేచురల్ మైథలాజికల్ థ్రిల్లర్ నుంచి తాజాగా విడుదలైన మాస్ సాంగ్ ‘ట్రెండ్ సెట్ చేయ్ పిల్లాడా’ యూట్యూబ్‌లో అప్పుడే దుమ్ము రేపుతోంది. నిజంగా ఈ పాట ‘ట్రెండ్ సెట్ చేయ్ పిల్లాడా’ అన్న పదానికి తగ్గట్టుగానే ఉంది.
ALSO READ: https://teluguprabha.net/cinema-news/rashmika-mandanna-3000-crore-box-office-record/
పాటలో సుధీర్ బాబు పక్కన ఆడిపాడిన బ్యూటీ శ్రేయా శర్మ. వీరిద్దరి మధ్య ఉన్న ‘కెమిస్ట్రీ’ప్రేక్షకులకు విజువల్ ట్రీట్‌గా మారింది. శ్రేయా శర్మ స్టెప్పులు, ఆమె గ్లామరస్, బోల్డ్ లుక్… పాటకి కావాల్సినంత మాస్ మసాలాను యాడ్ చేశాయి. ఈ పాటలో వారిద్దరి మధ్య కెమిస్ట్రీ తెరపై అగ్గి రాజేసేలా ఉంది!
జటాధర’ ఒక సీరియస్ మైథలాజికల్ థ్రిల్లర్ అయినా, ‘ట్రెండ్ సెట్ చేయ్ పిల్లాడా’ సాంగ్ మాత్రం పక్కా మాస్ మసాలా, డాన్స్ ఎంటర్‌టైనర్.


