సీనియర్ నటి జయప్రద(Jaya Prada) ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆమె సోదరుడు రాజాబాబు హైదరాబాద్‌లో కన్నుమూసినట్లు జయప్రద తెలిపారు. ఈమేరకు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. ‘నా అన్నయ్య రాజా బాబు మరణవార్తను మీకు తెలియజేయడానికి ఎంతో బాధగా ఉంది. ఆయన గురువారం హైదరాబాద్‌లో మరణించారు. దయచేసి ఆయన గురించి ప్రార్థించండి’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నారు. దీంతో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.
కాగా సినీ నటిగా 14 ఏళ్లకే కెరీర్ ప్రారంభించిన జయప్రద.. 300కు పైగా చిత్రాల్లో నటించారు. 1994లో ఆమె రాజకీయాల్లో అడుగుపెట్టారు. తొలుత తెలుగుదేశం పార్టీలో చేరి ఎంపీగా బాధ్యతలు నిర్వర్తించారు. అనంతరం సమాజ్‌వాదీ పార్టీలో పనిచేయగా.. ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు.