తమిళ హీరో జయం రవి(Jayam Ravi ) దంపతుల విడాకుల వ్యవహారం కొన్ని రోజులుగా హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ విడాకుల కేసుకు సంబంధించి జయం రవి, ఆయన భార్య ఆర్తి.. చెన్నైలోని ఫ్యామిలీ కోర్టుకు హాజరయ్యారు. విచారణ అనంతరం కౌన్సెలింగ్‌కు హాజరుకావాలని కోర్టు సూచించింది. అయితే ఈ సందర్భంగా జయం రవి నుంచి నెలకు రూ.40 లక్షల భరణం ఇప్పించాలని ఆర్తి పిటిషన్ దాఖలు చేసినట్టు సమాచారం. న్యాయస్థానం తదుపరి విచారణను జూన్ 12కి వాయిదా వేసింది.
అయితే డబ్బుల కోసమే రవి తమను వాడుకున్నారని ఆర్తి, ఆమె తల్లిదండ్రులు చెప్పిన సంగతి తెలిసిందే. ఇలాంటి సమయంలో ఆర్తి ఏకంగా నెలకు రూ.40 లక్షలు భరణం అడగడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. డబ్బులు కోసమే ఆర్తి కుటుంబం ఇదంతా చేస్తుంది అని నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. అసలు నెలకు రూ.40లక్షలు ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు.