Sunday, November 16, 2025
Homeచిత్ర ప్రభGaddar Awards: గద్దర్‌ అవార్డుల జ్యూరీ ఛైర్మన్‌గా జయసుధ

Gaddar Awards: గద్దర్‌ అవార్డుల జ్యూరీ ఛైర్మన్‌గా జయసుధ

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రకటించిన గద్దర్ ఫిల్మ్ అవార్డుల జ్యూరీ కమిటీకి ఛైర్మన్‌గా సీనియర్ నటి జయసుధ(Jayasudha) ఎంపికయ్యారు. 15 మంది సభ్యులతో జ్యూరీ ఏర్పాటైంది. అవార్డుల కోసం దరఖాస్తు చేసిన నామినేషన్లను ఈ నెల 21 నుంచి పరిశీలించనున్నారు. ఈమేరకు జయసుధ, FDC ఎండీ హరీశ్‌లతో సమావేశమైన TFDC ఛైర్మన్, నిర్మాత దిల్ రాజు (Dil Raju) నామినేషన్లను నిష్పక్షపాతంగా పరిశీలించాలని సూచించారు.

- Advertisement -

14 ఏళ్ల తర్వాత ప్రభుత్వం చలన చిత్ర అవార్డులను ఇస్తున్నట్టు గుర్తుచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా చలన చిత్ర అవార్డులకు ఇంతటి స్పందన రాలేదన్నారు. గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల కోసం అన్ని విభాగాల్లో 1248 నామినేషన్లు రాగా వ్యక్తిగత కేటగిరీలో 1172, ఫీచర్ ఫిల్మ్, చిల్డ్రన్ ఫిల్మ్స్, డాక్యుమెంటరీ, ఫిల్మ్ క్రిటిక్స్, పుస్తకాలు తదితర కేటగిరిలో 76 దరఖాస్తులు అందినట్టు ఆయన వెల్లడించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad