Baahubali Movie Bhallaladeva Character: బాహుబలి… తెలుగు ఇండస్ట్రీని పాన్ ఇండియన్ లెవెల్‌కు తీసుకెళ్లిన సినిమా. ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన బాహుబలి, బాహుబలి 2 సినిమాల తర్వాతే అన్ని ఇండస్ట్రీల చూపు టాలీవుడ్‌పై పడింది. ఇండియన్ సినిమా హిస్టరీలోనే హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాలుగా బాహుబలి, బాహుబలి 2 నిలిచాయి. బాహుబలి సినిమానే హీరోగా ప్రభాస్‌కు నేషనల్ వైడ్‌గా క్రేజ్‌ను తీసుకొచ్చింది.
భళ్లాలదేవగా రానా..
బాహుబలి మూవీలో ప్రభాస్‌కు ధీటైన పాత్రలో కనిపించాడు రానా దగ్గుబాటి. భళ్లాలదేవగా తన తన విలనిజంతో ఆకట్టుకున్నాడు. రానా దగ్గుబాటి కెరీర్‌లోనే బెస్ట్ మూవీస్‌గా బాహుబలి నిలిచింది. అయితే ఈ భళ్లాలదేవుడి పాత్ర కోసం సీనియర్ హీరోయిన్ జయసుధ కొడుకు నిహార్ కపూర్‌ను రాజమౌళి అప్రోచ్ అయ్యారట. బాహుబలిలో ఆఫర్ మిస్సవ్వడానికి గల కారణాలను ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేశాడు నిహార్ కపూర్. బాహుబలిలో భళ్లాలదేవుడి పాత్ర కోసం మొదట రానానే అనుకున్నారు. కానీ డేట్స్ సమస్యల వల్ల ఆయన ఈ క్యారెక్టర్ చేయడం కష్టంగా మారింది. దాంతో రాజమౌళి స్వయంగా భళ్లాలదేవుడి పాత్రకు నన్ను సెలెక్ట్ చేశారు. మూవీ టీమ్‌తో కలిసి నాలుగైదు వారాలు ట్రైనింగ్ చేశాను. రానా తిరిగి సినిమాలోకీ రీఎంట్రీ ఇవ్వడంతో భళ్లాలదేవ క్యారెక్టర్ ఆయనకే దక్కింది. నాకు కాలకేయ పాత్ర ఇస్తామని అన్నారని నిహార్ కపూర్ చెప్పాడు.
కాలకేయ పాత్రకు సంబంధించిన డిజైనింగ్‌ను నాకు చూపించారు. ముఖం కనిపించకుండా ప్రోస్తటిక్ మేకప్‌తో క్యారెక్టర్ కినిపిస్తుందని అర్థమైంది. ఈ పాత్ర చేయాలా వద్దా అని అమ్మను సలహా అడిగాను. ఫస్ట్ సినిమా నీ ఫేస్ కనిపించదు. యాక్టర్‌గా ఎస్టాబ్లిష్ కావని అమ్మ చెప్పడంతో ఆఫర్ రిజెక్ట్ చేశాను అని నిహార్ కపూర్ అన్నాడు. తాను రిజెక్ట్ చేసిన పాత్రను ప్రభాకర్ చేశారు. ఆ క్యారెక్టర్ అంత ఫేమస్ అవుతుందని తాను ఊహించలేదని నిహార్ కపూర్ చెప్పాడు. బాహుబలి మిస్సయినందుకు ఎలాంటి రిగ్రేట్‌గా ఫీలవ్వడం లేదని చెప్పాడు.
గ్యాంగ్‌స్టర్ గంగరాజు సినిమాలో…
2022లో రిలీజైన గ్యాంగ్‌స్టర్ గంగరాజు సినిమాలో విలన్‌గా నటించాడు నిహార్ కపూర్. రికార్డ్ బ్రేక్ అనే మరో సినిమా కూడా చేశాడు. ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు. యాక్టర్‌గా ఇండస్ట్రీలో నిలదొక్కుకునే ప్రయత్నాల్లో ఉన్నాడు. జయసుధ మరో కొడుకు శ్రేయాన్ కపూర్ బస్తీ అనే సినిమాలో హీరోగా నటించాడు. సినిమా ఫ్లాప్ కావడంతో శ్రేయాన్ ఇండస్ట్రీకి దూరమయ్యాడు.
Also Read – Pakistan: వరదలో కొట్టుకుపోతున్న పాకిస్తాన్..!


