Tuesday, June 24, 2025
Homeచిత్ర ప్రభJeethu Joseph: 3 భాషల్లో ఒకేసారి ‘దృశ్యం 3’

Jeethu Joseph: 3 భాషల్లో ఒకేసారి ‘దృశ్యం 3’

Drishyam 3: దర్శక ధీరుడు ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి బాహుబలి సీక్వెల్స్‌తో మన తెలుగు సినిమా రేంజ్‌ని పాన్ ఇండియావరకూ తీసుకెళ్ళిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత సౌత్‌లో వచ్చిన మరో సీక్వెల్స్ కేజీఎఫ్. ఈ సినిమాల తర్వాత సౌత్ సినిమాల మీద బాలీవుడ్ మాత్రమే కాదు హాలీవుడ్ మేకర్స్ ఫోకస్ కూడా గట్టిగా పడింది. ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత హిందీ మేకర్స్ మన తెలుగు సినిమా వైపే చూస్తున్నారు.

- Advertisement -

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా రూపొందిన పుష్ప ఫ్రాంఛైజీ మన తెలుగు ఇండస్ట్రీలో మరో సంచలనం. సుకుమార్ రూపొందించిన ఈ సినిమాలతో ఇండియన్ సినిమా రేంజ్ ఇదీ అని అందరూ గర్వంగా చెప్పుకున్నారు. ఈ సినిమాకి మూడవ భాగం కూడా ఉందని సుక్కూ హింట్ ఇచ్చాడు. ఇక హిట్ ఫ్రాంఛైజీస్‌లో ఇప్పటికే మూడు భాగాలు వచ్చి బ్లాక్ బస్టర్ సాధించాయి. నాలుగో భాగానికి రంగం సిద్ధం చేస్తుండగా కోలీవుడ్ స్టార్ కార్తి ఇందులో నటించబోతున్నారు.

ALSO READ: https://teluguprabha.net/cinema-news/tollywood-star-heroes-making-milestone-movies-in-their-careers/

ఇలా సీక్వెల్స్‌గా వచ్చి డీసెంట్ హిట్ సాధిస్తున్న సినిమాలలో దృశ్యం సీక్వెల్స్ ఒకటి. మలయాళంలో జీతూ జీసెఫ్ రూపొందించిన దృశ్యం 1 అండ్ 2 మలయాళం, తెలుగు, హిందీ భాషలలో భారీ సక్సెస్ సాధించాయి. మిగతా ఫ్రాంఛైజీలతో చూసుకుంటే దృశ్యం కథ, కథనాలలో నేచురాలిటీ ఉంటుంది. ఓ చిన్న ఫ్యామిలీకి సమస్య వస్తే దాన్ని ఎలా అధిగమించారనేదే పాయింట్. ఈ పాయింట్ ఫ్యామిలీ ఆడియన్స్ అందరికీ బాగా కనెక్ట్ అయింది. అందుకే, రెండు భాగాలకి మూడు భాషలలో మంచి ఆదరణ దక్కింది.

తాజా సమాచారం మేరకు దృశ్యం సీక్వెల్స్‌లో మూడవ భాగానికి సన్నాహాలు చేస్తున్నారు. మలయాళంలో మోహన్ లాల్, మీనా తెలుగులో వెంకటేశ్, మీనా హిందీలో అజయ్ దేవగన్, శ్రీయ శరన్ నటించారు. అలాగే, మూడవ భాగంలో కూడా ఇదే పెయిర్ రిపీట్ కానుందని లేటెస్ట్ న్యూస్. మూడు భాగాలకి కథ జీతూ జోసెఫ్ అందించనున్నారు. ఆ తర్వాత ఆయా భాషకి తగ్గట్టుగా, హీరో ఇమేజ్‌కి తగ్గట్టుగా చిన్న చిన్న మార్పులు చేసి తెరపైకి తీసుకురానున్నారు. ఇక తెలుగులో దృశ్యం కి శ్రీప్రియ, దృశ్యం 2 కి జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించారు. మరి పార్ట్ 3 ఎవరి చేతుల్లోకి వెళుతుందో చూడాలి. అక్టోబర్ నుంచి మొదలవనున్న ఈ సీక్వెల్ మాత్రం మూడు భాషలలో ఒకేసారి రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News