Jr NTR: దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే సామెతను తూచా తప్పకుండా పాటిస్తారు మన సినీ తారలు. స్వింగ్ లో ఉండగానే.. స్టార్ డమ్ పీక్స్ లో ఉండగానే ఒకవైపు భారీ రెమ్యునరేషన్ పుచ్చుకుంటూ మరోవైపు వాణిజ్య ప్రకటనలతో కూడా భారీగా జమచేసుకుంటుంటారు. తెలుగులో ఈ బ్రాండ్ అంబాసిడర్ హీరోలలో మహేష్ బాబు ముందుంటే.. ఆ తర్వాత ఎన్టీఆర్, అల్లు అర్జున్ కూడా పలు కంపెనీలకు ప్రచారం చేసి పెడుతున్నాడు.
ఎన్టీఆర్ ఇప్పటికే Navarathna oil, Parle Agro Appy Fizz, Celekt Mobiles అంబాసిడర్ గా వ్యవహరిస్తుండగా.. గతంలో OTTO షర్ట్స్ కి కూడా ప్రచారం చేశాడు. కాగా ఇప్పుడు ఎన్టీఆర్ ఖాతాలో మరో బ్రాండ్ కూడా చేరింది. ప్రముఖ ఫుడ్ బ్రాండింగ్ సంస్థ లిషియస్ ఫుడ్స్ సంస్థతో ఎన్టీఆర్ ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇందుకోసం ఒక సరికొత్త యాడ్ లో నటిస్తున్నట్లు తెలుస్తోంది.
తాజాగా ఎన్టీఆర్ ఇన్ స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ పెట్టాడు. ఈ పోస్ట్ లో త్వరలో బ్లస్టర్ ఎంట్రీ కోసం సిద్ధం అవ్వండి అంటూ బ్లాక్ కలర్ ట్రెండీ స్టైల్ సూట్ లో తారక్ అభిమానులను ఫిదా చేశాడు. ఇది బ్యాక్ సైడ్ నుండి తీసిన పిక్ కాగా.. ప్రస్తుతం ఈ యాడ్ షూట్ చేస్తున్నారు. త్వరలోనే ఈ యాడ్ ప్రేక్షకుల ముందుకు రానుండగా.. ఎప్పుడెప్పుడు ఈ యాడ్ చూస్తామా అని ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నట్లు కామెంట్లు చేస్తున్నారు.