Jr NTR Injured : ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ (Jr NTR) ఎన్టీఆర్ గాయపడినట్లు సమాచారం. దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు వివరాల్లోకి వెళితే ఇప్పుడు తారక్ హైదరాబాద్‌లో ఓ యాడ్ షూటింగ్‌లో బిజీగా ఉంటున్నారు. షూటింగ్ జరుగుతున్న సమయంలో తారక్ స్వల్పంగా గాయపడ్డట్లు ఆయన టీమ్ సభ్యులు వెల్లడించారు. షూటింగ్ సమయంలో ఆయన చేయికి స్వల్పంగా గాయమైంది. అయితే ఈ గాయం పెద్దది కాదని.. చాలా చిన్నవేనని సన్నిహిత వర్గాల సమాచారం. గాయం అయిన వెంటనే అక్కడ ఉన్న సిబ్బంది తక్షణమే ఫస్ట్ ఎయిడ్ (First Aid) అందించారు. ప్రథమ చికిత్స పూర్తయిన కొద్దిసేపటి తర్వాత, తారక్ మళ్లీ షూటింగ్‌లో పాల్గొన్నారు. ఉన్న బిజీ షెడ్యూల్‌లో ఎక్కువ గ్యాప్ తీసుకోవటానికి ఇష్టపడని ఎన్టీఆర్ చిత్రీకరణను కొనసాగించటంపై ఆయన డేడికేషన్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.
‘డ్రాగన్’ కోసం కొత్త లుక్..
ఈ ఏడాది ఇప్పటికే వార్ 2 అనే బాలీవుడ్ సినిమాతో మన ముందుకు వచ్చిన ఎన్టీఆర్.. పెద్దగా ఆకట్టుకోలేదు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. దీనికి డ్రాగన్ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఇప్పటికే కొంత మేరకు చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ పక్కా మాస్ అవతార్‌లో కనిపించబోతున్నారు. ఈ మూవీలో సరికొత్త లుక్‌లోకనిపించబోతున్నారు. దీనికి ఆయన దాదాపు ఏడు వారాల్లోనే పది కిలోల బరువు తగ్గారు. రీసెంట్‌గా జిమ్ తారక్ చేసిన ఎక్సర్‌సైజ్ వీడియో నెట్టింట తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ మూవీని వచ్చే ఏడాదిలో విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు.
కెజియఫ్, సలార్ చిత్రాలతో బాక్సాఫీస్ దగ్గర సంచలన క్రియేట్ చేసిన దర్శకుడు ప్రశాంత్ నీల్ ఇప్పుడు ఎన్టీఆర్‌తో సినిమా చేస్తుండటంతో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. తనదైన స్టైల్లోనే ప్రశాంత్ నీల్.. డ్రాగన్ కోసం ఓ కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేస్తున్నారు. మరో వైపు అభిమానులు కూడా ఈ మూవీ అప్‌డేట్స్ కోసం ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఇందులో రుక్మిణి వసంత్ కథానాయికగా నటిస్తోంది.
త్రివిక్రమ్ కోసం సన్నద్ధం..
ప్రశాంత్ నీల్ సినిమా తర్వాత ఎన్టీఆర్ తదుపరి చిత్రాన్ని త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేయబోతున్న సంగతి తెలిసిందే. కుమారస్వామి కథతో ఈ మూవీ తెరకెక్కనుంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మరో వైపు వచ్చే ఏడాదిలోనే దేవరకు కొనసాగింపుగా దేవర 2ను కూడా ఎన్టీఆర్ స్టార్ట్ చేయబోతున్నారు.
ALSO READ : https://teluguprabha.net/cinema-news/pawan-kalyan-heroine-ameesha-patel-given-clarity-on-her-marriage/


