Jr NTR Look – Kota Srinivasa Rao: టాలీవుడ్ స్టార్ మాన్ అఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఒకదాని తర్వాత ఒకటి లైన్ లో పెడుతున్నారు. ఎన్టీఆర్ వచ్చే నెల బాలీవుడ్ డెబ్యూ మూవీ వార్ 2 తో రాబోతున్నారు. బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ (Hrithik Roshan) మరో హీరోగా నటించారు. త్వరలో ఈ మూవీ ప్రమోషన్స్ ప్రారంభం కానున్నాయి. ఇక ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా చిత్రీకరణ జరుగుతోంది.
అయితే, అనారోగ్య సమస్యలతో ఇటీవల సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూశారు. ఈ నేపథ్యంలో తారక్.. కోట పార్దివదేహాన్ని చూసేందుకు ఆయన ఇంటికి వెళ్లారు. కోట కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపి ధైర్యం చెప్పారు. ఆ తర్వాత మీడియాతోనూ కోట గారి గురించి మాట్లాడారు తారక్.
Also Read – Supreme Court: సోషల్ మీడియాలో వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
కోట శ్రీనివాస రావుతో (Kota Srnivasa Rao) తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. రాఖి (Rakhi), బృందావనం (Brindavanam), టెంపర్ (Temper) లాంటి పలు చిత్రాలలో తారక్, కోట కలిసి నటించారు. ఇవన్నీ గుర్తు చేసుకున్న తారక్, కోట ప్రతి పాత్రకు ప్రాణం పోశారు.. ఇంతటి గొప్ప నటుడు మళ్ళీ పుట్టరని కొనియాడారు. నా సినీ ప్రయాణంలో కోట గారితో కలిసి నటించిన, పంచుకున్న క్షణాలు ఎప్పటికీ గుర్తుండి పోతాయని తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
ఇదే సమయంలో తారక్ లుక్ కూడా చర్చనీయాంశంగా మారింది. కొరటాల శివ రూపొందించిన దేవర (Devara) సినిమా కోసం అప్పట్లోనే కొంత బరువు తగ్గారు. ఆర్‌ఆర్‌ఆర్ లో తారక్ ని చూస్తే ఆ డిఫరెన్స్ బాగా తెలుస్తుంది. ఇప్పుడు ప్రశాంత్ నీల్ సినిమా కోసం ఇంకా స్లిమ్మ్ అయినట్టుగా అనిపిస్తోందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. చెప్పాలంటే తారక్ న్యూ లుక్ కాస్త షాకింగ్‌గానే ఉంది.
Jr.ntr @tarak9999 Tribute Legendery Actor , vilan , comedian #KotaSrinivasaRaoGaru 💔#RIPKotaSrinivasaRao pic.twitter.com/WGTfWz5Dy6
— 𝐂𝐡𝐚𝐤𝐫𝐢𝐍𝐭𝐫 💙 (@Chakrintr3) July 14, 2025


